ఉప్పు ఎక్కువగా తింటున్నారా? మీ గుండె, కిడ్నీలు మటాష్‌..

11 October 2026

TV9 Telugu

TV9 Telugu

ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమే అయినప్పటికీ, అది ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది

TV9 Telugu

శరీరంలో సోడియం పెరిగితే రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి ‘హై బీపీ’ కి దారితీస్తుంది. దీర్ఘకాలిక అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది

TV9 Telugu

ఉప్పు ఎక్కువైతే మూత్రపిండాల వడపోత సామర్థ్యం తగ్గి, కిడ్నీ వ్యాధులు వస్తాయి

TV9 Telugu

మనం ఎక్కువ ఉప్పు తీసుకున్నప్పుడు, మన శరీరం ఆ అధిక సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది

TV9 Telugu

ఈ ప్రక్రియలో సోడియంతో పాటు కాల్షియం కూడా శరీరం నుంచి బయటకు పోతుంది. దీనివల్ల ఎముకలు సాంద్రత కోల్పోయి బలహీనపడతాయి

TV9 Telugu

చిన్న దెబ్బలకే ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉప్పు, చక్కెరలు అత్యధికంగా ఉంటాయి. వాటిని వీలైనంత వరకు తగ్గించండి

TV9 Telugu

కూరల్లో ఉప్పుకు బదులు నిమ్మరసం లేదా ఇతర సహజ మసాలాలను వాడటానికి ప్రయత్నించండి. ఏదైనా వస్తువు కొనే ముందు అందులో ఎంత సోడియం ఉందో గమనించండి

TV9 Telugu

నీరు ఎక్కువగా తాగండి. ఇది శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపడానికి సహాయపడుతుంది. సైంధవ లవణంలో కూడా సోడియం ఉంటుంది. కాబట్టి పరిమితంగానే వాడాలి