డయాబెటిస్‌ ఉన్నవారు సీతాఫలం తినొచ్చా..?

03 October 2026

TV9 Telugu

TV9 Telugu

సీజ‌న‌ల్ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు ఏడాదిలో వ‌చ్చే ఆయా సీజ‌న్ల‌లో ప‌లు ర‌కాల పండ్లు ల‌భిస్తుంటాయి

TV9 Telugu

వాటిని తింటే ఎన్నో పోష‌కాల‌ను, ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక అలాంటి పండ్ల‌లో సీతాఫ‌లాలు కూడా ఒక‌టి

TV9 Telugu

ఇవి ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భిస్తుంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇవి ఎంతో తియ్యగా అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉంటాయి

TV9 Telugu

సీతాఫ‌లాల‌ను 100 గ్రాముల మోతాదులో తింటే సుమారుగా 101 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. పిండి ప‌దార్థాలు, స‌హ‌జ‌సిద్ధమైన చ‌క్కెర‌లు, ఫైబ‌ర్, ప్రోటీన్లు ఉంటాయి

TV9 Telugu

అధిక మొత్తాల్లో విట‌మిన్లు సి, బి6, పొటాషియం, మెగ్నిషియం, ఐర‌న్ కూడా ఉంటాయి. ఇక సీతాఫ‌లాల‌ను ఎవ‌రైనా స‌రే తిన‌వ‌చ్చు

TV9 Telugu

కానీ డ‌యాబెటిస్ ఉన్న‌వారు అధికంగా తిన‌కూడ‌దు. షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్రణ‌లో ఉంటే 50 గ్రాముల మోతాదులో లేదా ఒక పండును తిన‌వ‌చ్చు

TV9 Telugu

షుగ‌ర్ నియంత్రణ‌లో లేక‌పోతే ఈ పండ్లను తిన‌కూడ‌దు. అలాగే బ‌రువు త‌గ్గాల‌నే ప్రణాళిక‌లో ఉన్నవారు కూడా ఈ పండ్లకు దూరంగా ఉంటే మంచిది

TV9 Telugu

ఇలా జాగ్రత్తల‌ను పాటిస్తూ సీతాఫ‌లాల‌ను తింటుంటే అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గించి, ఆక్సీక‌రణ ఒత్తిడి త‌గ్గుతుంది