సిబిల్ స్కోర్ రోజూ చెక్ చేసుకుంటే నష్టమేనా..?

Venkatrao Lella

Images: Pinterest

11 OCT 2026

సిబిల్ స్కోర్‌ను కొంతమంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక లోన్స్, క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

అయితే సిబిల్ రిపోర్ట్ తరచుగా చెక్ చేసుకోవడం వల్ల స్కోర్ తగ్గుతుందనే అపోహ చాలామందిలో ఉంది.కానీ అది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. మీ స్వంత స్కోర్‌ను తనిఖీ చేయడం వల్ల దానిపై వాస్తవానికి ఎలాంటి ప్రభావం ఉండదంటున్నారు.

మీరు రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా, క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నా, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే తెలుసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. మీ ఆర్ధిక ఆరోగ్యాన్ని  పరిశీలించుకునేందుకు సహాయపడుతుంది.

మీరు సిబిల్ వెబ్ సైట్ లేదా ఇతర ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా సిబిల్ చెక్ చేసుకున్నప్పుడు దానిని సాఫ్ట్ ఎంక్వైరీగా పరిగణిస్తారు. మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకునేందుకు చేసిన ఎంక్వైరీగా భావిస్తారు. దీని వల్ల క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం అవ్వదు.

మీ స్కోర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ క్రెడిట్ రిపోర్టులోని తప్పులను గుర్తించి వాటిల్లో మార్పులు చేసుకునేందుకు సహాయపడుతుంది.

లోన్, క్రెడిట్ కార్డు జారీ కోసం ఒక బ్యాంకు, NBFC  మీ క్రెడిట్ స్కోర్ చేస్తే హార్డ్ ఎంక్వైరీగా పిలుస్తారు. ఎక్కువ హార్డ్ ఎంక్వైరీలు మీ సిబిల్‌పై ప్రభావితం చూపిస్తాయి. తక్కువ వ్యవధిలో అనేక రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం నష్టమే.

సిబిల్ రిపోర్టులో మీ లోన్లు, క్రెడిట్ కార్డులు చెల్లింపుల వివరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం వలన మీరు తప్పులను ముందుగానే గుర్తించవచ్చు. ఏదైనా పొరపాటు ఉంటే సరిచేసుకోవచ్చు.

EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. డ్యూ డేట్ తర్వాత కట్టడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.

క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉపయోగించినా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అంతేకానీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.