AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర ఉల్లికారం

రోజూ తినే కూరలు, పప్పులు బోర్ కొట్టినప్పుడు లేదా జలుబు చేసి నోరంతా చప్పగా ఉన్నప్పుడు ఘాటుగా, పుల్లగా ఏదైనా నంజుకుని తినాలనిపిస్తుంది. అలాంటి సమయాల్లో వంటింట్లో ఎప్పుడూ ఉండే తాజా కొత్తిమీర, ఎండుమిరపకాయలతో కేవలం ఐదు నిమిషాల్లో చేసుకునే అద్భుతమైన రెసిపీ 'కొత్తిమీర ఉల్లికారం'. సాధారణంగా చేసే కొత్తిమీర పచ్చళ్లలా కాకుండా.. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి మరియు పచ్చి ఉల్లిపాయతో స్పైసీగా కారపు ముద్దను నూరి, తాలింపు నూనెలో పచ్చివాసన పోయేలా వేయించి, చివరగా కొత్తిమీర తరుగును చేర్చి నీటి చుక్క లేకుండా మగ్గిస్తారు. 

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 12:44 PM

Share
కావలసిన పదార్థాలు: 1 పెద్ద కప్పు శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన తాజా కొత్తిమీర, 15 నుండి 18 ఎండు మిరపకాయలు, ఒకటిన్నర చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర , 15 నుండి 20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న రెబ్బ చింతపండు ,  పావు చెంచా పసుపు , రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా శనగపప్పు, అర చెంచా మినప్పప్పు, అర చెంచా ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వంట నూనె

1 / 5
తయారీ విధానం: ముందుగా కొత్తిమీరను నీటిలో రెండు మూడు సార్లు ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచాలి. స్టవ్‌పై పాన్ పెట్టి ఒకటిన్నర చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌పై దోరగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 చెంచా నూనె వేసి 15-18 ఎండుమిర్చి వేసి మాడిపోకుండా వేయించాలి. ఎండుమిర్చి వేగాక అందులోనే 15 నుండి 20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

2 / 5
 మిక్సీ జార్‌లో వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేయాలి. ఇందులోనే సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు, చిన్న రెబ్బ చింతపండు, పావు చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ తేమతోనే పేస్ట్‌లా నలుగుతుంది, అవసరమైతే ఒక చుక్క నీళ్లు వేసుకోవచ్చు.

3 / 5
కడాయిలో 3 నుండి 4 చెంచాల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మరియు 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పోపును దోరగా వేయించాలి. ఇందులో మళ్లీ ఎండుమిర్చి వేయకూడదు. పోపు వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ-ఎండుమిర్చి పేస్ట్‌ను వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి నూనె పైకి తేలే వరకు కలుపుతూ పచ్చివాసన పోయేలా బాగా వేయించాలి.

4 / 5
కారం పేస్ట్ చక్కగా వేగి నూనె తేలిన తర్వాత.. తరిగి పెట్టుకున్న కప్పు తాజా కొత్తిమీరను వేసి కలపాలి. కొత్తిమీర పచ్చివాసన పోయి సాఫ్ట్‌గా మగ్గే వరకు మూతపెట్టి చిన్న మంటపై రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మనైన 'కొత్తిమీర ఉల్లికారం' సిద్ధం! వేడివేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి, ఈ కారం కలుపుకుని పక్కన పచ్చి ఉల్లిపాయ ముక్క నంజుకుని తింటుంటే అమృతంలా ఉంటుంది !

5 / 5
Follow Us
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం

అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా

మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా

మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
జిగురు లేకుండా కరకరలాడే చీలికల బెండకాయ ఫ్రై..

ఫుల్లుగా ఫైబర్, ప్రోటీన్.. ఉదయాన్నే ఓ గిన్నెడు తినండి చాలు..

షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు

అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే