AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుండీల్లో మందారం మొక్కను ఎలా పెంచాలో తెలుసా?

ఇల్లు అందంగా కనిపించాలి అంటే ఇంటి ముందు అందమైన పూల మొక్కలు ఉండాల్సిందే అంటారు. అంతే కాకుండా చాలా మంది తమ ఇంటి ముందు అందమైన పూల మొక్కలను నాటుకుంటారు. ఇక అనేక రకాల పూల మొక్కలు ఉండగా, ముఖ్యంగా అందులో తప్పకుండా మందారం మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇంటి ముందు ప్లేస్ లేనప్పుడు చాలా మంది కుండీల్లో మొక్కలను పెంచుకుంటారు.

Samatha J
|

Updated on: Oct 11, 2026 | 11:20 AM

Share
 మరి ఇంటికి అందం, వాస్తు పరంగా కూడా కలిసి వచ్చే మందారం మొక్కను కుండీలో ఎలా పెంచాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కాగా, ఇప్పుడు మనం ఇంటి ముందు కుండీలో మందారం మొక్కను మంచిగా వేపుగా ఎలా పెంచుకోవాలో చూసేద్దాం పదండి.

1 / 5
ఇంటి తోటలో తప్పక ఉండాల్సిన పూల మొక్కల్లో మందారం మొక్క కూడా ఒకటి. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది దీనిని తప్పకుండా తమ ఇంటిలో పెంచుకుంటారు. అయితే ఈ మొక్కను మీరు కుండీలో పెంచాలి అనుకుంటే ముందుగా కుండ రకం చూడాలి.  మందారం మొక్క పెరిగే వాతావరణం, అదే ఏ కుండీలో ఉందో, అది మొక్క ఎక్కువ పువ్వులను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. చిన్న మందారం మొక్కలను పెంచుకోవడం కోసం టెర్రకోట కుండీ ఉపయోగించడం మంచిది. సిరామిక్ కుండీలలో పెంచడం వలన ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి కానీ, మొక్క అంత వేపుగా పెరగడానికి అవకాశం ఉండదు.

2 / 5
మందారం మొక్కను పెంచే సమయంలో మట్టి మిశ్రమాన్ని కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మొక్క బాగా ఎదగాలి అన్నా, ఎక్కువ పువ్వులను ఇవ్వాలి అన్నా, మట్టి మిశ్రమం చాలా అవసరం.  అందువలన మట్టి మిశ్రమం ఎంచుకునే సమయంలో  6.0-7.0 మధ్య pH ఉన్న, కొద్దిగా ఆమ్లత్వం గల, వదులుగా ఉండే త్వరగా నీరు ఇంకిపోయే మట్టిని ఎంచుకోవడం మందార మొక్కకు చాలా మంచిది అని చెప్పాలి.

3 / 5
అంతే కాకుండా మందార పువ్వుల మొక్క చాలా త్వరగా ఎదుగుతూ ఎక్కువ పువ్వులను ఇవ్వాలి అంటే తప్పకుండా దానికి పొటాషియం అందించాలి. సరైన మోతాదులో ఎరువులను అందించినప్పుడే అది బాగా వేపుగా పెరుగుతుంది. వారంలో ఒక్కసారి ఎరువులు వేసినా, మొక్కలు చాలా వేగంగా సులువుగా పెరుగుతుంటాయి.

4 / 5
మందార మొక్క పెరగడానికి సూర్యరశ్మి కూడా చాలా అవసరం. నివసించే ప్రదేశం లేదా అది పెరిగే వాతావరణాన్ని బట్టి సూర్యరశ్మి అందే ప్రాంతంలో ఈ మొక్కను పెంచడం చాలా  అవసరం. అంతే కాకుండా మొక్కకు నీరు కూడా పుష్కలం అవసరం పడతాయి. అందువలన ప్రతి రోజూ దీనికి సరిపడ నీరు అందించాలి. మట్టి తడి ఆరిన ప్రతి సారి నీరు పోయడం వలన మొక్క మంచిగా పెరుగుతుంది. మొక్క పెరిగే కొద్దీ కత్తిరింపులు చేపట్టాలి.

5 / 5
Follow Us