AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా కాంటాక్ట్స్ ట్యాబ్

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా కాంటాక్ట్స్ ట్యాబ్

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 9:28 AM

Share

వాట్సాప్‌ యూజర్ల కోసం కొత్త ‘కాంటాక్ట్స్‌ ట్యాబ్‌’ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టెక్‌ నివేదికలు చెబుతున్నాయి. ఇందులో పేరు, ఫోన్‌ నంబర్‌, యూజర్‌నేమ్‌తో కాంటాక్ట్స్‌ను వెతకవచ్చు. ఆన్‌లైన్‌ స్టేటస్‌ సూచనలు, పుట్టినరోజు రిమైండర్లు, కాంటాక్ట్స్‌ను క్రమబద్ధీకరించే ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. మెటా ఏఐ, స్నేహితులకు ఆహ్వానం పంపే సదుపాయాలు సైతం అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ ఎప్పుడు విడుదలవుతుందో అధికారికంగా వెల్లడించలేదు.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. యూజర్లు తమ కాంటాక్ట్స్‌ను మరింత సులభంగా వెతికి, నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ‘కాంటాక్ట్స్ ట్యాబ్’ను అభివృద్ధి చేస్తున్నట్లు టెక్ నివేదికలు చెబుతున్నాయి. డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ కొత్త ట్యాబ్‌ ద్వారా పలు కీలక ఫీచర్లు ఒకే స్క్రీన్‌పై అందుబాటులోకి రానున్నాయి. పైభాగంలో ఉండే సెర్చ్ బార్ సహాయంతో పేరు, నంబర్ లేదా యూజర్‌నేమ్‌తో కాంటాక్ట్‌ను వెతకవచ్చు. అలాగే అక్షరక్రమం లేదా యాక్టివిటీ ఆధారంగా కాంటాక్ట్స్‌ను వర్గీకరించుకోవచ్చు. కాంటాక్ట్ ప్రొఫైల్ పిక్ పక్కన గ్రీన్ డాట్ ద్వారా ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు. కాంటాక్ట్స్‌లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే కేక్ ఎమోజీతో పాటు “Birthday today” అనే లేబుల్ కనిపిస్తుంది. దీని ద్వారా నేరుగా అక్కడి నుంచే విష్ చేయవచ్చు. కాంటాక్ట్ లిస్ట్ చివర్లో Meta AI ని ఉపయోగించుకునే లింక్‌తో పాటు ఇతరులకు యాప్ ఆహ్వానం పంపే “Invite a friend” ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. యూజర్లు ఇప్పటికే సెట్ చేసుకున్న ప్రైవసీ సెట్టింగ్స్‌ను ఈ కొత్త ఫీచర్ సైతం గౌరవిస్తుంది. ఆన్‌లైన్ స్టేటస్ లేదా లాస్ట్ సీన్ ప్రైవసీలో దాచుకున్న వారి వివరాలు ఇతరులకు కనిపించవు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వర్షన్ అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్‌!

బాబోయ్‌.. వింతపాము…రెండు తలలు, నాలుగు కాళ్లతో

చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం

ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!

అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!

Follow Us