AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai Metro: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

తమిళనాడు పట్టణ రవాణా రంగంలో సరికొత్త మైలురాయి ఆవిష్కృతం అయ్యింది. చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 నెట్‌వర్క్‌లోని తొలి మార్గాన్ని సీఎం విజయ్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం విజయ్‌తో కలిసి మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. అ సందర్భంగా మెట్రోలోని విద్యార్థులతో ప్రధాని మోదీ ఆత్మీయంగా ముచ్చటించారు.

Chennai Metro: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
Pm Narendra Modi Chennai Metro
Anand T
|

Updated on: Oct 11, 2026 | 12:50 PM

Share

చెన్నై, అక్టోబర్ 11: నగర ప్రజల చిరకాల స్వప్నమైన చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 నెట్‌వర్క్‌లోని తొలి మార్గాన్ని అధికారికంగా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రజల ప్రయాణ సమయాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో పూనమల్లి నుంచి వడపళని వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర సీఎం విజయ్‌తో కలిసి అధికారికంగా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి పూనమల్లి నుంచి పోరూర్ బైపాస్ వరకు మెట్రోలో ప్రయాణించారు. అలాగే మెట్రోలో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ప్రధాని మోదీ, విజయ్ ఆత్మీయంగా మాట్లాడారు.

ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఐఐటీ మద్రాస్‌లో జరిగే కార్యక్రమంలో పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత, సాయంత్రం 4 గంటల నుంచి సామాన్య ప్రయాణికులకు ఈ మార్గంలో సేవలు అందుబాటులోకి వస్తాయి.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
జిగురు లేకుండా కరకరలాడే చీలికల బెండకాయ ఫ్రై..
జిగురు లేకుండా కరకరలాడే చీలికల బెండకాయ ఫ్రై..
ఫుల్లుగా ఫైబర్, ప్రోటీన్.. ఉదయాన్నే ఓ గిన్నెడు తినండి చాలు..
ఫుల్లుగా ఫైబర్, ప్రోటీన్.. ఉదయాన్నే ఓ గిన్నెడు తినండి చాలు..
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు