AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా.. ఒక్క మాటతో.. రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ తన కాలేజీ రోజుల్లో టాలీవుడ్ హీరోయిన్ పై పదేళ్లపాటు ప్రేమ, తీవ్రమైన ఆరాధన పెంచుకున్నట్లు వెల్లడించారు. ఆమె పోస్టర్ల నుంచి క్లోజప్ షాట్‌ల వరకు చూస్తూ, ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రేమ చివరకు నిరాశతో ముగిసిందని తెలిపారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Ram Gopal Varma: శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా.. ఒక్క మాటతో.. రామ్ గోపాల్ వర్మ..
Rgv
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2026 | 12:58 PM

Share

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా నటి జయసుధ పట్ల తనకున్న పదేళ్ల ప్రేమ, ఆరాధన గురించి ఆయన వెల్లడించారు. ఇది శ్రీదేవిపై తనకున్న అభిమానానికి ముందు కాలేజీ రోజుల్లో మొదలైందని పేర్కొన్నారు. తన జీవితంలో అనేక మందికి “ఐ లవ్ యూ” చెప్పానని వర్మ ప్రారంభించారు. అయితే, తన కాలేజీ రోజుల్లో సత్య అనే అమ్మాయిని ప్రేమించానని, ఆమె మెడికల్ కాలేజీ విద్యార్థిని అని తెలిపారు. ఆమె అందం, హోదా ముందు తాను పనికిరానని భావించి ఎప్పుడూ తన ప్రేమను వ్యక్తపరచలేదని చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత, ఆమెకు తనంటే ఇష్టమని తెలిసిందని, కానీ అప్పటికే తన పెళ్లి అయిపోయిందని విచారం వ్యక్తం చేశారు. దీనిని శ్రీదేవి విషయంలోనూ ఇలాగే జరిగిందని, ప్రేమించిన అమ్మాయిలందరినీ ఇలాగే పోగొట్టుకున్నానని వర్మ అన్నారు. అయితే, ఆయన నిజమైన ఆరాధన జయసుధ పట్ల ఉందని స్పష్టం చేశారు. కాలేజీ రోజుల్లో దాదాపు పదేళ్ల పాటు జయసుధపై విపరీతమైన ప్రేమను పెంచుకున్నారని చెప్పారు. జ్యోతి సినిమా వాల్‌పోస్టర్లను రోడ్డుపై నిలబడి గంటల తరబడి చూసేవారట. కాకినాడలోని రామ్ ప్రియా థియేటర్‌లో ప్రదర్శితమైన అమరదీపం సినిమాను ఏడుసార్లు చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాను కేవలం ఒక పాటలో వచ్చే మూడు సెకన్ల జయసుధ క్లోజప్ షాట్ కోసమే చూశానని, అది కూడా పరీక్షల సమయంలో అని ఆయన నవ్వుతూ చెప్పారు. మిగతా సినిమాతో తనకు సంబంధం లేదని, కేవలం ఆ క్లోజప్ కోసమే వెళ్ళేవాడినని అన్నారు.

జయసుధను మొదటిసారి ప్రత్యక్షంగా శ్రీవారి ముచ్చట్లు సినిమా షూటింగ్‌లో చూశానని, ఆమె ఆవలిస్తూ కనిపించడంతో నిరాశకు గురయ్యానని ఆర్జీవీ తెలిపారు. తెరపై ఒక దివ్యమైన రూపంగా చూసిన తన ఆరాధ్య దేవత, సాధారణ మనిషిలా ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఇది తనను మోసం చేసినట్లు అనిపించిందని అన్నారు. ఆ తర్వాత రావు గారి ఇల్లు సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు జయసుధకు సీన్ పేపర్ ఇచ్చే అవకాశం లభించిందని, ఆ సీన్ కూడా తానే రాశానని వర్మ వివరించారు. ఆమె ఆ సీన్ చదివి తన ప్రతిభకు మురిసిపోయి “ఎవరు రాశారు?” అని అడుగుతుందని ఊహించుకున్నారట. కానీ, ఆమె “ఎన్ని పేజీలు?” అని అడిగి, కేవలం షాట్ వివరాలు చెప్పమని అనడంతో తన ఆరాధన పూర్తిగా భగ్నమైందని వాపోయారు.

చివరిగా, మనీ సినిమా గురించి జయసుధతో మాట్లాడేందుకు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనను ఆర్జీవీ గుర్తుచేసుకున్నారు. మంచి దుస్తులు ధరించి, బెల్ కొట్టగా తలుపు తీసిన నితిన్ కపూర్ (జయసుధ భర్త) తన ప్రేమకథకు చివరి తెర దించారని వర్మ తెలిపారు. జయసుధకు పెళ్లయిందని తెలిసినప్పటికీ, నితిన్ కపూర్ ను ప్రత్యక్షంగా చూసినప్పుడు తన కలలు పూర్తిగా కరిగిపోయాయని వివరించారు. ఈ అనుభవాలన్నీ తన జీవితంలో ఒక ప్రత్యేకమైన దశను సూచిస్తాయని ఆర్జీవీ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

రామ్ గోపాల్ వర్మ, జయసుధ..

Rgv, Jayasudha

Rgv, Jayasudha

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

Follow Us
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
జిగురు లేకుండా కరకరలాడే చీలికల బెండకాయ ఫ్రై..
జిగురు లేకుండా కరకరలాడే చీలికల బెండకాయ ఫ్రై..