Sun Transit 2026: నెల రోజులు ఉద్యోగ, వ్యాపారాల్లో వారికి విజయాలు! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు రవి తన స్వక్షేత్రమైన సింహ రాశిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అధికార యోగంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పురోగతి సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ ప్రాబల్యం పెరగడంతో పాటు మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశం ఉంది.

Sun Transit In Leo
ఈ నెల(ఆగస్టు) 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు రవి తన స్వక్షేత్రమైన సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. గ్రహ రాజైన రవి సింహ రాశిలో సంచారం చేస్తున్నంత కాలం తనకు అనుకూల మైన రాశులకు ఏదో విధంగా రాజయోగం కలిగిస్తూనే ఉంటాడు. రవికి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశులు అనుకూల రాశులు. ఈ రాశులకు చెందిన జాతకులకు అధికార యోగం పట్టడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా అందలాలు ఎక్కుతారు. రాజకీయ ప్రాబల్యం కలగడంతో పాటు, మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి పంచమంలో రవి తన స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా ఈ రాశి వారిని ఉచ్ఛ స్థితికి, ఉన్నత స్థాయికి తీసుకు వస్తాడు. రాజకీయ వర్గాల వారికి, ప్రభుత్వంలోని వారికి ఇది బాగా యోగ కాలంగా ఉంటుంది. అధికారంతో పాటు ఆదాయపరంగా కూడా అంచనా లకు మించిన అభివృద్ధి ఉంటుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. మార్పు కోరుకుంటున్న వారికి మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి స్వక్షేత్ర ప్రవేశం వల్ల ఈ రాశివారు ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అదనపు రాబడికి అవకాశ ముంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పోటీదార్లపై విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో రవి స్వక్షేత్ర సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందు తుంది. రావలసిన సొమ్ముతో పాటు మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. అధికా రంతో పాటు ఆర్థికంగా కూడా ఉన్నత స్థానానికి వెళ్లడం జరుగుతుంది. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇష్టమైన విదేశీ ఉద్యోగం లభిస్తుంది.
- సింహం: స్వక్షేత్రంలో రాశ్యధిపతి రవి సంచారం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా సంపదకలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా, కుటుంబపరంగా కూడా అదృష్టం పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు అభివృద్ది బాటపడతాయి. విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా, సామాజికంగా ఊహించని ప్రాధాన్యం ఏర్పడుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి స్వస్థానంలో ప్రవేశిచడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగు తుంది. తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలోనే అయినప్పటికీ ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. డిమాండ్ బాగా పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఆశించినఉపశమనం లభించే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి స్వక్షేత్ర సంచారం వల్ల అనేక శుభవార్తలు వినడం, ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సామాజికంగా ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. జీతభత్యాలతో పాటు రాబడి కూడా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
ఇవి కూడా చదవండి
Follow Us



