AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలోని హోంగార్డులకు అదిరిపోయే శుభవార్త.. ఆ పోస్ట్‌ల భర్తీలో 10 శాతం రిజర్వేషన్!

రాష్ట్రంలోని హోంగార్డులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే పోలీస్ స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

రాష్ట్రంలోని హోంగార్డులకు అదిరిపోయే శుభవార్త.. ఆ పోస్ట్‌ల భర్తీలో 10 శాతం రిజర్వేషన్!
Big Relief For Ap Home Guards
Anand T
|

Updated on: Sep 25, 2026 | 8:11 PM

Share

రాష్ట్ర పోలీస్ శాఖలో హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే పోలీస్ స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ తాజాగా ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పోలీస్ శాఖలో భర్తీ చేసే ప్రతి 100 డ్రైవర్ కానిస్టేబుల్‌ పోస్టుల్లో 10 పోస్టులు ఆ శాఖలో పనిచేసే అర్హులైన హోంగార్డులకే లభించనున్నాయి. అయితే ప్రభుత్వం కేవలం హోంగార్డు కోటాలో మాత్రమే మార్పులు చేసినట్టు తెలిపింది. మిగతా విభాగాల్లోని ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం సవరించిన ప్రత్యేక రిజర్వేషన్ విధానాన్ని రాబోయే రోజుల్లో జరిగే పోలీస్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్‌లో అమలు చేయనున్నట్టు తెలిపింది. అంటే ఇకపై జరగబోయే అన్ని రిక్రూట్‌మెంట్‌లలో అర్హులైన హోంగార్డులకు 10 శాతం రిజర్వేషన్‌ను కల్పించనున్నారు. ఈ రిజర్వేషన్ అమల్లోకి రావడంతో ఎన్నో ఏళ్లుగా తక్కువ జీతంతో పనిచేస్తున్న హోంగార్డులకు కాస్త ఊరట లభించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us