ఏపీ SLPRBలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1,27,480 జీతం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB, AP) ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) విభాగంలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB, AP) ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) విభాగంలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ SLPRBలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు
- సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్) పోస్టుల సంఖ్య: 10
- సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) పోస్టుల సంఖ్య: 13
- సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలాజికల్/సెరోలాజికల్) పోస్టుల సంఖ్య: 20
సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, బయోలాజికల్/సెరోలాజికల్ సైన్సెస్, జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ తదితర సంబంధిత స్పెషలైజేషన్లలో విద్యార్హత కలిగిన వారు పోస్టులకు అర్హులు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా రాత పరీక్ష, ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష 120 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.44,570 నుంచి రూ.1,27,480 వరకు పే స్కేల్ ప్రకారం వేతనం లభిస్తుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఫీజు తదితర సమాచారాన్ని SLPRB, AP అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. విద్యార్హతలు, వయోపరిమితి, రాత పరీక్ష సిలబస్, దరఖాస్తు ఫీజు తదితర పూర్తి వివరాలను త్వరలోనే విడుదల చేయనున్న అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోండి.
ఏపీ SLPRBలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




