AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC UG ఆన్సర్‌ కీ విడుదల.. సెప్టెంబర్ 30 వరకు అభ్యంతరాలకు అవకాశం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) నాన్‌-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్‌గ్రాడ్యుయేట్‌ CEN 07/2025కు సంబంధించిన CBT 2 ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌ను విడుదల చేశాయి. సెప్టెంబర్‌ 17న నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ప్రశ్నపత్రం, తాము ఎంచుకున్న సమాధానాలు, అధికారిక ఆన్సర్‌ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో..

RRB NTPC UG ఆన్సర్‌ కీ విడుదల.. సెప్టెంబర్ 30 వరకు అభ్యంతరాలకు అవకాశం
RRB NTPC UG CBT II Answer Key
Srilakshmi C
|

Updated on: Sep 25, 2026 | 3:45 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 25: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు RRB కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) నాన్‌-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్‌గ్రాడ్యుయేట్‌ CEN 07/2025కు సంబంధించిన CBT 2 ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌ను విడుదల చేశాయి. సెప్టెంబర్‌ 17న నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ప్రశ్నపత్రం, తాము ఎంచుకున్న సమాధానాలు, అధికారిక ఆన్సర్‌ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు. ఇండియన్‌ రైల్వేలోని వివిధ జోన్లలో 3,058 అండర్‌గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా అభ్యర్థులకు CBT 2 పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ఆన్సర్‌ కీని పరిశీలించి తమ సమాధానాలను అధికారిక కీతో సరిపోల్చుకోవచ్చు. తద్వారా పరీక్షలో సాధించే అవకాశం ఉన్న మార్కులపై ఒక అంచనాకు రావచ్చు.

సెప్టెంబర్‌ 30 వరకు అభ్యంతరాలు

ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు అవకాశం కల్పించాయి. అధికారిక ఆన్సర్‌ కీలో ఏదైనా ప్రశ్నకు ఇచ్చిన సమాధానం తప్పుగా ఉందని భావిస్తే, నిర్ణీత విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరం నమోదు చేయవచ్చు. అభ్యంతరాలు నమోదు చేసేందుకు సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు గడువు ముగిసేలోపు తమ అభ్యంతరాలను సంబంధిత ఆధారాలతో సమర్పించాలి.

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

RRB NTPC CBT-II Answer Key ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?

  • సంబంధిత RRB అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి.
  • హోమ్‌పేజీలో CEN 07/2025 NTPC UG CBT-II Answer Keyకు సంబంధించిన లింక్‌ను ఎంచుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ కావాలి.
  • లాగిన్‌ అయిన తర్వాత Question Paper, Response Sheet, Answer Keyను పరిశీలించాలి.
  • సమాధానాలను అధికారిక ఆన్సర్‌ కీతో సరిపోల్చుకోవాలి.
  • అవసరమైతే ఆన్సర్‌ కీని డౌన్‌లోడ్‌ చేసుకుని భద్రపరుచుకోవాలి.
  • అభ్యంతరం ఉంటే సంబంధిత ప్రశ్నను ఎంచుకుని, సూచించిన విధంగా ఆన్‌లైన్‌లో అభ్యంతరం నమోదు చేయాలి.

ఆన్సర్‌ కీని పరిశీలించేటప్పుడు అభ్యర్థులు తమ రెస్పాన్స్‌ షీట్‌లో నమోదైన సమాధానాలను అధికారిక కీతో జాగ్రత్తగా పోల్చుకోవాలి. ఏదైనా సమాధానంపై అభ్యంతరం ఉంటే, బోర్డు సూచించిన విధానాన్ని అనుసరించి గడువులోపు ఆక్షన్‌ తీసుకోవాలి. ఆన్సర్‌ కీపై అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన తర్వాత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు వాటిని పరిశీలించి తదుపరి నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు..

  • CBT2 పరీక్ష నిర్వహించిన తేదీ: సెప్టెంబర్‌ 17
  • ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్: విడుదల
  • అభ్యంతరాల చివరి తేదీ: సెప్టెంబర్‌ 30
  • మొత్తం పోస్టులు: 3,058

అభ్యర్థులు ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌, అభ్యంతరాల గడువు తదితర వివరాల కోసం తమకు సంబంధించిన RRB అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us