AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు రెండో వారంలో వీరికి అప్పుల బాధలే

బల్గేరియాకు చెంది ప్రసిద్ధ జ్యోతిష్యురాలు బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె భవిష్యత్తు చెప్పే మహిళగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. 12 ఏళ్ల వయసులో తుఫాను కారణంగా చూపును కోల్పోయిన ఈ మె తర్వాత తన అంచనాల ద్వారా, భవిష్యత్తును చెప్పడం ప్రారంభించింది. ఈమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి.

Samatha J
|

Updated on: Aug 09, 2026 | 2:59 PM

Share
దీంతో బాబా వంగా జ్యోతిష్యం పై చాలా మందికి  నమ్మకం ఏర్పడింది. అయితే బాబా వంగా 2026 సంవత్సరంలో ఆగస్టు రెండో వారంలో కొన్ని రాశుల వారు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతారు అని తెలియజేయడం జరిగింది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారిని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అనుకోని ఇబ్బందులు ఎదురు అవుతాయంట. అందువలన ఈ రాశి వారు చాలా ఆచీ తూచి అడుగు వేయాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారు కూడా డబ్బుల విషయంలో ఆచీ తూచీ అడుగే వేయాలి. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మీ మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉన్నదంట. అందుకే జాగ్రత్త తప్పనిసరి.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి మానసికంగా చాలా కుంగిపోవాల్సి వస్తుంది. అనుకున్న పనులు ఏవీ కాకపోవడంతో ప్రతీదాంట్లో నిరాశే ఎదురు అవుతుంది. ఉద్యోప్రయత్నాలు విఫలం అవుతాయి. చాలా విధాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందువలన ఈ వారం మొత్తం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలంట.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి అనుకోని ఖర్చులు అధికం అవుతాయంట. అంతే కాకుండా చేతిలోకి డబ్బు వచ్చినట్లే వచ్చి మాయం అవుతుందని చెబుతున్నారు పండితులు. ఆగస్టు రెండో వారంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట. లేకపోతే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

5 / 5
Follow Us