Dasara Navratri 2026: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాల అలంకరణతో కొండ వెలిగిపోతుండగా, తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఏడాది సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, దిగువన విస్తృత ఏర్పాట్లు చేసి, ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.
కనకదుర్గమ్మ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ నగరం భక్తిభావంతో మైమరిచిపోతుండగా, ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. విద్యుద్దీపాల కాంతుల్లో ఇంద్రకీలాద్రి మహాగ్రహంలా మెరిసిపోతుంటే, జగన్మాత కనకదుర్గ ఆలయం దివ్యమైన దేదీప్యమాన కాంతులతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కొండపైన, కొండ దిగువనా విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల తొలి రోజైన ఇవాళ ఉదయం 8 గంటల నుంచి భక్తులను దేవి దర్శనానికి అనుమతిస్తున్నారు. నవరాత్రుల తొలి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ కటాక్షిస్తున్నారు. కొండ దిగువన ఉన్న వినాయకుడి ఆలయం వద్ద నుంచి భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా కొండపైకి నడిచి వచ్చి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము…రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

