అంతా కొత్త ప్రపంచం.. భయంగా ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..

Rajitha Chanti

Pic credit - Instagram

11 October 2026

'జెంటిల్‌మన్', 'నిన్ను కోరి', 'వి', '35 చిన్న కథ కాదు' వంటి చిత్రాల్లో తన నటనతో అలరించిన ఈ బ్యూటీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. 

సోషల్ మీడియా వేదికగా నివేతా థామస్ పంచుకున్న సందేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతా కొత్త ప్రపంచం, భయంగా ఉందని తెలిపింది. 

ఇదంతా నాకు ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తోంది.. లోపల ఏదో తెలియని భయంగా కూడా ఉంది అంటూ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది నివేదా..

ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో అనుభవపూర్వకంగా వచ్చిన మాటలుగా ఇవి కనిపిస్తున్నాయి.

నటిగా ఎంతటి కష్టమైన పాత్రనైనా చాలా సులువుగా పోషించే నివేతా, ఇలాంటి భావోద్వేగ భరిత పోస్ట్ పెట్టడంతో అభిమానులు స్పందిస్తున్నారు.

 ఆమె తదుపరి సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రమోషన్ స్టంట్‌లో భాగంగా ఈ పోస్ట్ పెట్టారా లేక జీవితంలో ఏదైనా కొత్త మార్పు గురించా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ, విలక్షణమైన పాత్రలతో అలరించే ఈ టాలెంటెడ్ నటి పోస్ట్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నివేదాకు మంచి ఫాలోయింగ్ ఉంది.