AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindhoor: ‘పాక్‌తో యుద్ధం వద్దు’.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులకు భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు భారత సైన్యానికి మద్దతు ఇస్తున్నారు.అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం పాకిస్తాన్ తో యుద్ధం వద్దంటోంది.

Operation Sindhoor: 'పాక్‌తో యుద్ధం వద్దు'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 08, 2025 | 5:23 PM

Share

భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిపింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టాయి. ఇక యుద్ధ సన్నాహకాల్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. మరోవైపు పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని చెబుతున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని అఖిల పక్ష నాయకులు తేల్చిచెప్పేశారు. సెలబ్రిటీలు కూడా మోదీ సర్కారుకు అండదండగా నిలబడుతున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన ఆమె ‘నేను పూర్తి దేశభక్తురాలిని కానీ అదే సమయంలో నేను పూర్తి శాంతి ప్రేమికురాలిని. చిన్న లేదా పెద్ద యుద్ధం వచ్చే సూచనలు దేశ ప్రతిష్టకు మంచిది కాదు, అది భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది అంతర్జాతీయ పర్యాటకులపై కూడా ప్రభావం చూపవచ్చు. యుద్ధంలో పాల్గొన్న దేశానికి కలిగే నష్టం అపారమైనది. త్వరలోనే అంతా ప్రశాంతంగా ముగిసిపోతుందని నేను ఆశిస్తున్నాను..జై హింద్, అని సంజన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

సంజనా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలామంది సంజనను విమర్శస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సంజన తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే.2005లో తరుణ్ నటించిన సోగ్గాడు సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైందీ అందాల తార. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాజశేఖర్ సత్యమేవ జయతే, శ్రీకాంత్ దుశ్శాసన, ముగ్గురు, యమహో యమహా, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లోనూ నటించిందీ ముద్దుగుమ్మ. కాగా ఈ అమ్మడు డ్రగ్ కేసులో చిక్కుకున్న కొన్ని రోజులు జైలు జీవితం గడిపింది.

భర్తతో సంజనా గల్రానీ..

సినిమాల సంగతి పక్కన పెడితే.. 2020 లాక్ డౌన్ సమయంలో బెంగుళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని వివాహం చేసుకుంది సంజన. 2022లో ఈ దంపతులకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి తల్లికానుందీ అందాల తార.

మెటర్నీటీ ఫోటో షూట్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..