షాకింగ్ న్యూస్ ! ఛావాను మిస్ చేసుకున్న మహేష్ బాబు
రీసెంట్ డేస్‌లో హిట్ అవ్వడమే కాదు.. అందర్నీ ఎమోషనల్‌గా ఆకట్టుకున్న ఫిల్మ్ ఛావా..! విక్కీ కౌషల్ హీరోగా.. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్టైంది. బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించేసింది. ఆ తర్వాత తెలుగులోనూ రిలీజ్ అయి ఇక్కడ కూడా మంచి వసూళ్లను సాధించింది.
ఓటీటీలో కూడా రికార్డ్ లెవల్ వ్యూయింగ్ మినెట్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఓటీటీలో మంచి రెస్పాన్స్‌తో రన్ అవుతోంది. అలాంటి ఈ ఛావా సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతూనే.. తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న ఫిల్మ్ లవర్స్‌ను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇక ఆ విషయం ఏంటంటే… ఈ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ మొదట ఈ సినిమాలో హీరోగా విక్కీ కౌషల్‌ను అనుకోలేదట. మొదట సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ సినిమా కోసం తీసుకోవాలని అనుకున్నారట. మహేష్ కు కూడా కలిసి డైరెక్టర్ ఉటేకర్ ఈ స్టోరీ వినిపించాడట. మహేష్ నుంచి రెస్పాన్స్ రాకపోయినా.. చాలా రోజులు బాబు కోసమే వెయిట్ చేశాడట. అయినా మహేష్ నుంచి ఎలాంటి కాల్ రాకపోవడంతో.. సెకండ్ ఆప్షన్ గా విక్కీ కౌషల్‌ను కలిసి ఈ మూవీ స్టోరీ వినిపించారట డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. ఇక కౌషల్ ఓకే చెప్పడంతో.. చకా చకా తెరకెక్కించేసి.. అనుకున్న టైంకు రిలీజ్ చేశారట. అలా రిలీజ్ అయిన ఈసినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా మహేష్ దగ్గరకు మొదట రావడం.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే మహేష్ బాబు ఈ మూవీని రిజెక్ట్ చేయడం అనే విషయం అందర్నీ షాకయ్యేలా.. అవాక్కయ్యేలా.. చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీరి.. వీరి గుమ్మాడి.. దీని పొట్ట నిండా నీళ్లేనండి
అర్ధరాత్రి గ్రామంలో వణుకు పుట్టించిన అనుకోని అతిథి
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని

పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా..

నెల్లూరు జిల్లాలో అద్భుతం - శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము

ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ

యజమానిపై ప్రేమతో.. ఏనుగులు ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో

పులిని మింగబోయిన అనకొండ... ఆఖరికి అంతా షాక్ వీడియో

హెయిర్ ట్రాన్స్ ప్లాంట్‌కు బలైన ఇంజనీర్.. వికటించిన ఇంజెక్షన్..
