ఆసుపత్రిలో చేరిన ఉపేంద్ర.. అభిమానుల్లో ఆందోళన.. క్లారిటీ
మే 5న కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించిందని వార్తలు రావడంతో కంగారు పడ్డారు. దీనికి తోడు ఉప్పీ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దీంతో అభిమానులు బాగా టెన్షన్ పడ్డారు. కానీ ఉపేంద్ర ఆ తర్వాత కొన్ని గంటలకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
అయితే ఉపేంద్ర గత కొన్ని రోజులుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో UI సినిమా షూటింగ్ సమయంలోనూ ఉపేంద్ర ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే మరోసారి అదే సమస్య బాధించడంతో… ఉపేంద్ర బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొంది.. తిరిగి ఇంటికి వచ్చాడని ఆయన టీం చెప్పింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక కొద్ది సేపటికే ఉపేంద్ర కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.. ‘అందరికీ నమస్కారం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే నేను ఆసుపత్రికి వెళ్లాను. అంతే తప్ప.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విని అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెందవద్దు. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు’ అని ఉపేంద్ర ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు కూల్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్ చెప్పిన మెగా జోడీ తొందర్లో అమ్మనాన్నగా
‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట గురించి గమ్మత్తయిన విషయం చెప్పిన చిరు
తాతకు తగ్గ మనవడు !! అరుదైన ఘనత సాధించిన శోభన్ బాబు మనవడు
AI సాయంతో పూర్తి సినిమా తీసిన డైరెక్టర్! అవుట్ పుట్ అదిరిపోయింది
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

