AI సాయంతో పూర్తి సినిమా తీసిన డైరెక్టర్! అవుట్ పుట్ అదిరిపోయింది
ఏయ్ టెక్నాలజీతో ఇప్పుడందరూ మ్యాజిక్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీతో తమ ఊహాలోకానికి రూపం ఇస్తున్నారు. వీఎఫెక్స్ కోసం వేచి చూడకుండా అరక్షణంలో అరచేతుల్లో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అలా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్ ఏకంగా ఈ టెక్నాలజీ సాయంతో ఫుల్ సినిమానే తీసి అందరినీ షాక్‌కు గురిచేశారు.
గతంలో బెంగుళూరులోని బాగలగుంట ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేసిన నరసింహమూర్తి కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక తాజాగా తానే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌గా మారి పూర్తి ఏఐ టెక్నాలజీతో లవ్ యూ సినిమాను తెరకెక్కించారు నరసింహమూర్తి. ఇక పది లక్షల బడ్జెట్‌తో పూర్తి ఏఐ టెక్నాలజీతో ప్రేయతైన ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ ఏఐ జనరేటెడ్ మనుషులే. అంతేకాదు ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ డబ్బింగ్ అని ఏఐతోనే క్రియేట్ చేశారు. దీనికోసం డైరెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో నూతన ఏఐ టెక్నీషియన్ పనిచేశారు. ఇక ఈ సినిమా గురించి తాజాగా టీవీ నైన్‌తో మాట్లాడిన డైరెక్టర్ నరసింహమూర్తి తమ సినిమా డ్యూరేషన్ 95 నిమిషాలు ఉందని చెప్పారు. అంతేకాదు తమ సినిమాలో 12 పాటలు ఉన్నాయని ఇవన్నీ కంప్లీట్‌గా ఏఐ జనరేటెడ్ అంటూ చెప్పారు. అంతేకాదు తమ లవ్ యూ సినిమాను రీసెంట్‌గా సెన్సార్ సభ్యులు చూశారని వారు తమ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారని చెప్పారు. ఈ సినిమా కోసం తాము ఆరు నెలలు పనిచేశామని మే నెలలో థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు డైరెక్టర్ నరసింహమూర్తి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

