AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం !! తెలుగు డైరెక్టర్‌ను అవమానించిన విజయ్‌ దళపతి

దారుణం !! తెలుగు డైరెక్టర్‌ను అవమానించిన విజయ్‌ దళపతి

Phani CH

|

Updated on: May 07, 2025 | 4:00 PM

తెలుగు తమిళ్! ఈ రెండు ఫిల్మ్ ఇండస్ట్రీలు ఇప్పుడు కలిసి ఉన్నట్టే కనిపిస్తున్నప్పటికీ.. ఈ రెండింటి మధ్య ఎప్పటి నుంచో ఓ చిన్న బేధం ఉంటూనే ఉంది. అదే భాషా భేదం! మద్రాసు రాష్ట్రంగా తెలుగు తమిళ్ కలిసున్నప్పుడు మొదలైన ఈ భేదం.. ఆ తర్వాత ఉద్యమం గా మారి తెలుగు వాళ్లందరూ వేరయ్యేలా చేసింది.

అయినా కానీ… భాషను చూపుతూ.. అప్పుడప్పుడూ తమిళులు తెలుగు వారిని వేరు చేయడం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరో సారి అలాంటిదే కనిపించింది. ఈ భాషా భేదం కారణంగానే టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ ను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ పక్కకు పెట్టడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయం గురించి మన స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డేర్ గా చెప్పడం సంచలనం అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! వీర సింహా రెడ్డి సినిమాతో.. బాలయ్యతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని.. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నించారట. విజయ్‌ను నేరుగా కలిసి స్టోరీ కూడా నరేట్ చేశాటర. విజయ్‌ కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే గోపీచంద్‌ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ క్రమంలోనే తన టీంలో పక్కనే ఉన్న ఒకరు రాజకీయాల్లోకి వెళ్లే టైంలో… తెలుగు డైరెక్టర్‌తో సినిమా అవసరమా అని దళపతికి చెప్పడంతో…! తమిళ ప్రజల్లో ఏదైన వ్యతిరేకత వస్తుందేమో.. ఆలోచించు అని విజయ్‌తో అనడంతో… దళపతి ఆలోచనలో పడ్డారట. ఆ తర్వాత గోపీచంద్‌తో సినిమా చేయకుండా మొఖం తిప్పేశాడట. అయితే ఇదే విషయాన్ని గోపీచంద్ మలినేని రీసెంట్‌ గా ఓ ఇంటర్వ్యూలో ఉన్నదున్నట్టు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేర్‌టేకర్‌ మృతి.. సింహం చివరి చూపుకు వచ్చి.. ఏం చేసిందంటే ??

భర్త గడ్డం నచ్చక.. మరిదితో మహిళ జంప్‌

బస్సు ఆపి డ్రైవర్‌ నమాజ్‌.. ఆ తర్వాత

జైలు ప్రాంగణంలోనే పెళ్లి.. ఖైదీలే అతిథులు.. అదే కదా మ్యాజిక్కు

గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తుడు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌