అర్ధరాత్రి గ్రామంలో వణుకు పుట్టించిన అనుకోని అతిథి
అర్ధరాత్రి ఆ ఊర్లోకి అనుకోని అతిథి ప్రవేశించింది. రాత్రివేళ జనమంతా గాఢ నిద్రలో ఉండగా, ఇళ్ల మధ్య సంచరిస్తూ వింత శబ్ధాలు చేసింది. అది విన్న గ్రామస్తులు భయంతో హడలెత్తిపోయారు. రాత్రి తమ ఊర్లోకి వచ్చిన ఆ అతిథి ఎవరో తెలుసుకునేందుకు గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూసిన గ్రామస్తులు షాక్ అయ్యారు.
భయంతో వణికిపోయారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో అర్థరాత్రి అనుకోని అతిథి హడలెత్తించింది. రాత్రి తమ ఊర్లోకి వచ్చిన ఆ అతిథి ఎవరో తెలుసుకునేందుకు గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇళ్ల మధ్య చిరుత పులి సంచరిస్తూ కనిపించింది. అది చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏదైనా పనిమీద ఎవరైనా బయటకు వస్తే చిరుతకు బలైపోయేవాళ్లం అనుకుంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చిరుతపులి గ్రామంలో యధేచ్చగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వారం రోజుల్లో ఇది మూడోసారి చిరుత సంచరిస్తూ కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆసుపత్రిలో చేరిన ఉపేంద్ర.. అభిమానుల్లో ఆందోళన.. క్లారిటీ
గుడ్ న్యూస్ చెప్పిన మెగా జోడీ తొందర్లో అమ్మనాన్నగా
‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట గురించి గమ్మత్తయిన విషయం చెప్పిన చిరు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

