రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చే ఆమోద ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అయితే ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు వారి కుటుంబంలోని కొత్త వ్యక్తుల పేర్లను చేర్చుకునేందుకు కొన్ని పరిమితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏడేళ్లు దాటిన వారికి మాత్రమే ప్రభుత్వం రేషన్ కోటాను కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది.
పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల చేరికకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో దాదాపు 20 శాతం మేర పరిష్కరించింది. అయితే మిగతా దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల్లోనే పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం గ్రేటర్ పరిధిలోని మూడు లక్షలపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వం నాటి నుంచే రేషన్‌కార్డులలో కొందరి సభ్యుల పేర్లు తొలగింపు కొనసాగుతున్నప్పటికి.. కొత్త సభ్యుల చేరిక ప్రక్రియ మాత్రం అందుబాటులో లేకుండాపోయింది. దీంతో పాటు ఉమ్మడి కుటుంబాలు రెండుగా విడిపోవడం, వివహారాలు జరగడంతో కుటుంబాల్లోకి కొత్త సభ్యులు చేరడం వంటి వాటితో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆసుపత్రిలో చేరిన ఉపేంద్ర.. అభిమానుల్లో ఆందోళన.. క్లారిటీ
గుడ్ న్యూస్ చెప్పిన మెగా జోడీ తొందర్లో అమ్మనాన్నగా
‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట గురించి గమ్మత్తయిన విషయం చెప్పిన చిరు
తాతకు తగ్గ మనవడు !! అరుదైన ఘనత సాధించిన శోభన్ బాబు మనవడు
AI సాయంతో పూర్తి సినిమా తీసిన డైరెక్టర్! అవుట్ పుట్ అదిరిపోయింది

బరాత్ తీయలేదని.. పెళ్లి కూతురు జంప్ వీడియో

వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో

విమానంలో బొద్దింకలు.. షాక్‌లో ప్రయాణికులు వీడియో వైరల్

బావంటే మోజు... అందుకే భర్తకు స్పాట్ వీడియో

ఏఐ ను కూడా వదలరా మావ.. ప్రేమలో పడిన మహిళ.. చివరకు

బస్సులో సీటు కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

బావ సై అన్నాడు.. భర్తను నై అన్న మహిళ.. చివరికి వామ్మో అలానా..
