AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహినీ గురించి మీకు తెలుసా..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ .. ఎవరి అండదండలు లేకుండా అష్ట కష్టాలు పడి చలన చిత్ర పరిశ్రమలో ఒక పేజీ లిఖించుకున్నాడు. శ్రీకర్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టిన అజిత్ కుమర్.. తమిళన సినిమాల్లో నటిస్తూ వరస సుపర్స్ అందుకుని స్టార్ హీరో రేంజ్ కు చేరుకున్నాడు. తమిళనాడులో అజిత్ కు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అయితే అజిత్ కుమార్ సికింద్రాబాద్ లో జన్మించాడు. అయితే అజిత్ కుమార్ మూలాలు పాకిస్తాన్ లో ఉన్నాయని మీకు తెలుసా..

Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహినీ గురించి మీకు తెలుసా..
Ajith Kumar Father And Mother
Surya Kala
|

Updated on: May 09, 2025 | 6:03 PM

Share

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అజిత్‌ ఒకప్పుడు ఇంటి అద్దె కట్టలేని స్టేజ్ నుంచి వరస హిట్స్ తో స్టార్ హీరో రేంజ్ కు చేరుకున్నాడు. ఇటీవలే పద్మ భూషణ్ అజిత్ కుమార్ స్వయం కృషితో ఎదిగాడు. నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న అజిత్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి రేసర్ కూడా.. చదివింది కేవలం పదవ తరగతి. అయితే బహుభాషాకోవిదుడు. అయితే అజిత్ కుమార్ మూలాలు అఖండ భారత దేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన దేశంలో ఉన్నాయని మీకు తెలుసా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం

అజిత్ కుమార్ తల్లిదండ్రులు రెండు రాష్ట్రాలకు చెందిన వారు.. అజిత్ తండ్రి పి సుబ్రహ్మణ్యన్ కేరళ లోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందినవారు. అయితే సుబ్రహ్మణ్యన్ కేరళీయ తమిళుడి. అజిత్ తల్లి మోహిని పాకిస్తాన్లోని కరాచీ ప్రాంతానికి చెందినవారు. అంటే సింధ్‌కు చెందిన సింధీ హిందూ. అంటే అతనికి సింధీ వారసత్వం ఉంది. తల్లి కుటుంబం దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి అనేక మంది హిందువులు భారత దేశానికి కాందిశీకులుగా తరలి వచ్చారు. అలా తరలి వచ్చిన అజిత్ అమ్మమ్మగారి ఫ్యామిలీ కలకత్తాకు వచ్చి స్థిరపడింది. అయితే అజిత్ కుమార్ మాత్రం హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో జన్మించారు. అందుకే తెలుగు అబ్బాయిగా అభిమానులు అభిమానిస్తారు. ఈ విషయాన్నీ అజిత్ ఒక ఇంటర్వ్యూలో  విభజనకు ముందు నా తల్లి కరాచీ (పాకిస్తాన్) నుండి వచ్చిందని చెప్పారు.

ఇలా పాకిస్థాన్ నుంచి భారత్ తరలివచ్చిన ప్రముఖుల్లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అలాగే భారత మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ , బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ వంటి వారు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..