AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindhoor: పెళ్ళైన మూడు రోజులకే దేశ రక్షణ కోసం బయలుదేరిన జవాన్.. నవ వధువు ఏమి చెప్పిందంటే..

సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి ఒక మధురమైన జ్ఞాపకం.పెళ్లి జరిగిన తర్వాత నవ దంపతులు సరదాగా హనీమూన్ కి వెళ్ళాలని భావిస్తారు. అయితే ప్రస్తుతం భారత దేశం, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో సెలవుల్లో ఉన్న ఆర్మీ జవాన్లు దేశ రక్షణ కోసం తమతమ స్థానాలను చేరుకుంటున్నారు. ఇలా పెళ్లి జరిగిన మూడు రోజులకే సైనికుడు దేశ రక్షణ కోసం బయలుదేరుతుంటే.. నవ వధువు వీడ్కోలు పలికింది.

Operation Sindhoor: పెళ్ళైన మూడు రోజులకే దేశ రక్షణ కోసం బయలుదేరిన జవాన్.. నవ వధువు ఏమి చెప్పిందంటే..
Operation Sindhoor
Surya Kala
|

Updated on: May 09, 2025 | 4:39 PM

Share

వ్యక్తిగత జీవితం కంటే కర్తవ్యం ఎల్లప్పుడూ ముఖ్యమైనది. అందునా దేశ రక్షణ విషయంలో అయితే మరింత ప్రధాన స్థానం ఉంటుంది.. ఇది మరోసారి రుజువైంది. మహారాష్ట్ర జల్గావ్‌లోని పచోరా తాలూకాలోని పుంగావ్‌కు చెందిన మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ అనే యువకుడు ఆర్మీ జవాన్ గా విధులను నిర్వహిస్తున్నాడు. పెళ్లి కోసం సెలవుల మీద వచ్చిన మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాదం మే 5వ తేదీ, సోమవారం వివాహం జరిగింది. అయితే భారత దేశం, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తితలు మరింత పెరిగాయి.. మంగళవారం యుద్ధంలాంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్మీ అధికారులు సెలవుల మీద తమ సొంత గ్రామాలకు వెళ్ళిన ఆర్మీ సిబ్బందిని రీకాల్ చేస్తున్నారు. వెంటనే ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలా తన పై అధికారుల నుంచి ఆదేశం అందుకున్న వెంటనే కొత్త పెళ్లి కొడుకు దేశ రక్షణ కోసం నేను సైతం అన్నాడు. తన కుటుంబాన్ని నవ నవవదువుని విడిచి 8, గురువారం విధుల్లో చేరడానికి బయలుదేరాడు. ఇందు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

తమ భర్తకు వీడ్కోలు పలికేందుకు నూతన వధువుతో పాటు.. కుటుంబ సభ్యులు.. ఇతర గ్రామస్తులు కలిసి పచోరా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కన్నీరు మధ్య జ్ఞానేశ్వర్ కు వీడ్కోలు చెప్పారు. దేశాన్ని రక్షించడానికి తన సిందూరాన్ని పంపుతున్నానని నూతన వధువు అయిన యామిని పాటిల్ తన భర్తకు వీడ్కోలు పలుకుతూ చెప్పారు.

ఇవి కూడా చదవండి

పచోరా తాలూకాలోని పుంగావ్‌కు చెందిన మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ అనే యువకుడు భారత సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. మే 5, సోమవారం పచోరా తాలూకాలోని కలాంసర గ్రామానికి చెందిన యామినిని వివాహం చేసుకున్నాడు. వివాహ జరిగిన తర్వాత్ నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం చేయించడం ఆచారం కనుక.. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఈరోజు, మే 9, శుక్రవారం జ్ఞానేశ్వర్ ఇంట్లో సత్యనారాయణ పూజ ఏర్పాటు చేశారు. అయితే అంతకు ముందే యుద్ధం లాంటి పరిస్థితి కారణంగా.. సెలవుల మీద ఉన్న సైన్యం విధులకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ సందర్భంలో మనోజ్ పాటిల్ తన దేశ రక్షణకే ప్రాధాన్యత ఇస్తూ గురువారం సరిహద్దు వద్దకు బయలుదేరాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్