AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketu Transit 2025: ఈ నెలలో రాశిని మార్చుకోనున్న కేతు.. ఈ 3 రాశుల వారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్..

హిందూ మతంలో కేతువును పాప గ్రహంగా పరిగణిస్తారు. అయితే కేతువు మనిషి జీవితాన్ని మార్చడానికి ఎక్కువ సమయం పట్టాడు. అది శుభ ఫలితం అయినా అశుభ ఫలితం అయినా సరే.. ఈ నెలలో కేతు తన రాశిని మార్చుకోనున్నాడు. దీంతో కొన్ని రాశులకు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ మార్పు ఒక వరం లాంటిది. అదే సమయంలో కొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Ketu Transit 2025: ఈ నెలలో రాశిని మార్చుకోనున్న కేతు.. ఈ 3 రాశుల వారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్..
Ketu Transit 2025
Surya Kala
|

Updated on: May 09, 2025 | 2:43 PM

Share

జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో మే 2025 నెల చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో కేతువు తన గమనాన్ని రెండుసార్లు మార్చుకోనున్నాడు. సాధారణంగా ఏడాదిన్నరకు ఒకసారి కేతు రాశిని మార్చుకుంటాడు. ఇప్పుడు కేతువు మొదట రాశిని మార్చుకుని అంటే కేతువు మొదట సింహరాశిలో ప్రవేశించి ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాఫల్గుణి మొదటి పాదంలో కేతువు సంచారం ఆదివారం, మే 18, 2025 సాయంత్రం 4:30 గంటలకు ఉంటుంది. ఈ సంచారము వలన 3 రాశుల వారు ఎంతో ప్రయోజనం పొందుతారు. వీరి జీవితం సంపద, కీర్తి , సౌకర్యాలతో నిండి ఉంటుంది. కేతువు వల్ల నక్షత్రంలా ప్రకాశించే ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం. అయితే హిందూ మత గ్రంథాల ప్రకారం జీవితంలోని సంఘటనలు మీ జాతకంలో గ్రహాల స్థానం మీద ఆధారపడి ఉంటాయి.

వృషభ రాశి: ఈ నెలలో కేతు సంచారము వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో ఆర్థిక బలం ఉంటుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనడానికి అవకాశం పొందుతారు. సంబంధాలలో కూడా మాధుర్యం పెరుగుతుంది. చాలా కాలంగా చేయాలని అనుకుంటున్న పని ఈ సముయంలో పూర్తి చేస్తారు. అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు. మంచి పెట్టుబడి అవకాశాన్ని కూడా పొందవచ్చు.

సింహ రాశి: రాశిని మార్చుకునే కేతువు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు. వీరి ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. భవిష్యత్తులో మీకు ఉపయోగపడే కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: కేతువు గమనంలో మార్పు ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగం ,వ్యాపారంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. తమ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. సంపదని పలు సంస్థల్లో పెట్టుబడి పెట్టగలుగుతారు. శని ఒత్తిడి నుంచి వీరికి కొంత ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌