Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఏనుగుకి ప్రత్యేక స్థానం.. వివిధ రంగుల ఏనుగు విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఏనుగులు అదృష్టం, శ్రేయస్సు, బలానికి శక్తివంతమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. హిందూ గ్రంథాలు, ఫెంగ్ షుయ్, వాస్తు శాస్త్రం ఇంట్లో ఏనుగు బొమ్మను ఉంచుకోవడం శుభప్రదం. ఏనుగు విగ్రహాన్ని సరైన దిశలో, సరైన ప్రదేశంలో ఉంచినట్లయితే.. ఏనుగు విగ్రహం అపారమైన వాస్తు ప్రయోజనాలను అందిస్తుంది. ఏనుగు విగ్రహం గణేశుడు, గౌతమ బుద్ధుడితో ముడిపడి ఉంది. అవి అందరికీ తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏనుగు విగ్రహాలు కష్టాలు,అడ్డంకులను తొలగిస్తాయని నమ్మకం.
Updated on: May 01, 2025 | 6:31 PM

ప్రవేశద్వారం వద్ద ఏనుగు శిల్పాలు: అనేక పురాతన హిందూ భవనాల ప్రవేశ ద్వారాల వద్ద రెండు భారీ రాతి ఏనుగులు వాటి తొండాలను పైకి లేపి ఉండటం సర్వసాధారణం. వాస్తు ప్రకారం భవనం మధ్యలో ఉత్తరం , దక్షిణం వైపు ముఖంగా ఏనుగు విగ్రహాలను ఉంచాలి. ఇలా చేయడం ప్రజాదరణ, సమృద్ధి, శక్తిని సూచిస్తుంది.

ఆకుపచ్చ, నల్ల ఏనుగు: పచ్చని ఏనుగును తూర్పు దిశలో ఉంచితే శక్తి, బలం, ఉత్సాహం పెరుగుతాయి. ఇల్లు లేదా కార్యాలయంలో ఉత్తర ప్రాంతంలో నల్ల ఏనుగును ఉంచడం వల్ల శ్రేయస్సు, విజయం ఆకర్షిస్తుంది.

ఇత్తడి ఏనుగు: భారతదేశంలో ఇత్తడి ఏనుగు చాలా ప్రజాదరణ పొందింది. ఇత్తడి ఏనుగును ఎక్కడ ఉంచినా అక్కడ సామరస్యం, సానుకూలత పెరుగుతుందని అంటారు. ఇవి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి.

ఎర్ర ఏనుగు: వాస్తు శాస్త్రంలో ఎర్ర ఏనుగును కీర్తి, శక్తి, విజయానికి చిహ్నంగా భావిస్తారు. ఇలా ఎర్ర రంగు ఏనుగును ఇంటి దక్షిణ ప్రాంతంలో ఉంచవచ్చు. ఇది ఆ ఇంటి సభ్యుల ఖ్యాతిని పెంచుతుందని.. చేస్తున్న రంగంలో గుర్తింపును ఇస్తుందని నమ్మకం.

వెండి ఏనుగు విగ్రహం: హిందూ మతంలో వెండి ఏనుగును అదృష్టం, శ్రేయస్సు, శక్తికి చిహ్నంగా భావిస్తారు. వీటిని ఇంటి మధ్యలో ఉత్తర దిశకు ఎదురుగా ఉంచవచ్చు. ఈ ఏనుగు విగ్రహం సానుకూల శక్తిని, విజయాన్ని, అదృష్టాన్ని ఆహ్వానిస్తుందని కూడా చెబుతారు.

ఏనుగు తొండం: ఏనుగు తొండం ఎత్తైనదిగా ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆనందాన్ని వ్యక్తపరచడానికి, స్నేహితులను పలకరించడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రవేశ ద్వారం వద్ద ఏనుగులు పెట్టినప్పుడు.. అవి పైకి తొండం ఉండేవిగా చూసుకోవాలి. ఇలాంటి తొండం ఉన్న ఏనుగు ఇంట్లోకి సానుకూల శక్తిని, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. తొండం క్రిందికి ఉంచిన ఏనుగు దీర్ఘాయువు, సంతానోత్పత్తి, స్థిరత్వానికి చిహ్నం. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల స్థిరత్వం, సామరస్యం పెంపొందుతాయి.

ఏనుగుల జత: జంట ఏనుగులు జీవితంలో ప్రేమన పెంచుతాయి. కనుక భార్యాభర్తల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి జంట ఏనుగుల విగ్రహాలను పడకగదిలో ఉంచడం మంచిది.