AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అక్కడ చెరువు గట్టుపై అమ్మవారి మట్టి బొమ్మని చేసి ఘనంగా పూజలు చేసే రైతులు.. ఎందుకంటే

కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి వెలసిన భక్తుల పాలిట కొంగు బంగారంగా మారింది. కొల్లేరు వాసుల ఇలవేల్పు విగ్రహాన్ని మట్టి బొమ్మగా తయారు చేసి చెరువు గట్టుపై ప్రతిష్టించి రైతులు పూజలను నిర్వహించారు. చేతికి అంది వచ్చిన పంటను కోసే ముందు రైతులు ఇలా మట్టితో పెద్దింట్లమ్మ విగ్రహాన్ని తయారు చేసి పూజ చేసి కోతలకు సిద్ధం చేస్తారు.

Andhra Pradesh: అక్కడ చెరువు గట్టుపై అమ్మవారి మట్టి బొమ్మని చేసి ఘనంగా పూజలు చేసే రైతులు.. ఎందుకంటే
Clay Peddintlamma
B Ravi Kumar
| Edited By: Surya Kala|

Updated on: May 01, 2025 | 7:22 PM

Share

ఏలూరు: వినాయక చవితి పండుగ రోజు చాలా మంది మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తారు. కొందరు స్వయంగా బంకమన్ను తీసుకుని వచ్చి వినాయకుని ప్రతిమను తయారు చేస్తారు. అసలు వినాయకుడు ఎలా జన్మించాడు అంటే పార్వతీదేవి తన శరీరానికి రాసుకున్న పసుపు ముద్దుతో గణేషుడి ని స్రృష్టించి ప్రాణం పోసింది. ఆయన పుట్టిన రోజు ను యావత్ భారత దేశం ప్రజలు వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి అని పిలుచుకుంటారు. ఇంకా పూజ, వ్రతం సమయంలో గౌరీదేవి పూజ చేయటం మనకు తెలిసింది. తమలపాకులో పసుపు ఉంచి దాన్ని జాగ్రత్తగా తడుపుతూ ముద్దగా చేసి బొట్టు పెట్టి, పూలతో అలంకరించి పూజ చేస్తాము. అయితే కొల్లేరు లో చేతికొచ్చిన పంట కోసే ముందు ఏమి చేస్తారో తెలుసా. గట్టుపై పెద్ధింట్లమ్మను మట్టితో తయారు చేస్తారు. ఆ విగ్రహానికి పూజలు చేసి పొంగలు వండి, కోడిని కోసుకుని అందరూ కోతలకు సిద్ధమవుతారు. అక్కడే భోజనాలు చేయటం కొల్లేరు ప్రాంతంలో ఆనవాయతీ గా వస్తుంది.

ఎవరీ కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి

కొల్లేరు ప్రాంతంలో ని కైకలూరు నియోజకవర్గంలో కొల్లేటి కోట గ్రామంలో పెద్ధింట్లమ్మ తల్లి ఆలయం ఉంది. కొల్లేరు ప్రాంతం ప్రజలు ఆమెను తమ ఇలవేల్పుగా కొలుస్తారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు దూరం ప్రాంతాల నుంచి నిత్యం అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. కొల్లేటి కోట చూట్టూ నీరు ఉంటుంది. ద్వీపకల్పంలా ఉంటుంది. ఆలయంలో అమ్మవారు పద్మాసనం లో కూర్చుని ఉంటారు. ప్రతియేటా జాతర ఘనంగా జరుగుతుంటుంది. కొల్లేరు ప్రజలు ప్రభలు కట్టి, బోనాలు తో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. వేంగి రాజులు కాలంలోనే ఆలయం నిర్మించారని చెబుతారు. ఇక్కడ దీనికి సంబంధించిన పలు శాసనాలు, ఆనవాళ్లు లభించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..