AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలం వెళుతున్నారా..? ఐదు రోజుల పాటు ఆ దర్శనాలు బంద్.. స్వామివారిని దర్శించుకోవాలంటే..

ఉగాదికి శ్రీశైలం వెళుతున్నారా..? అయితే భక్తులకు అలర్ట్. ఐదు రోజుల పాటు స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన జారీ చేశారు. ఇక ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు.

Srisailam: శ్రీశైలం వెళుతున్నారా..? ఐదు రోజుల పాటు ఆ దర్శనాలు బంద్.. స్వామివారిని దర్శించుకోవాలంటే..
Srisailam Darshan
Venkatrao Lella
|

Updated on: Mar 02, 2026 | 9:50 AM

Share

తెలుగు రాష్ట్రాల నుంచి తరచూ వేల మంది భక్తులు శ్రీశైలం శ్రీమల్లిఖార్జునస్వామివారిని దర్శించుకునుందుకు వెళ్తుంటారు. దీంతో నిరంతరం భక్తుల రద్దీతో శ్రీశైలం ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనాలకు సంబంధించిన ప్రతీ విషయం గురించి భక్తులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నెలలో ఉగాది వస్తుండటం, పండుగ సెలవులు రానుండటంతో శ్రీశైలం వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఉగాది సందర్భంగా శ్రీశైలంలో ఉత్సవాలు జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఏర్పడే అవకాశముండటంతో ఆలయ నిర్వాహకులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

5 రోజుల పాటు ఈ దర్శనాలు బంద్

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు స్పర్శ దర్శనాలు బంద్ చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. కేవలం ఈ ఐదు రోజుల పాటు భక్తులకు అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని, స్పర్శ దర్శనం అవకాశం అందుబాటులో ఉండదని తెలిపారు. మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు నాలుగు విడతలుగా ఆన్ లైన్‌లో భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రతీ స్లాటుకు 1500 టికెట్ల కరెంట్ బుకింగ్, ఆన్‌లైన్‌లో 500 టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాలను తెలుసుకోవాలని సూచించారు. శ్రీశైలంలోని పారిపాలన భవనంలో ఉగాది ఉత్సవాలు, దర్శన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నేటి నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి

సోమవారం నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం 5 లక్షల వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంచామని, వీటిని భక్తులకు అందిస్తామని అన్నారు. ఇక పాదయాత్ర, పార్కింగ్ ఏరియాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉగాది ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. ఈ సారి ఉగాదికి 7 లక్షల మంది భక్తులు శ్రీశైలంకు వస్తారని అంచనా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అటు మార్చి 3న చంద్రగ్రహణం సందర్బంగా శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. భక్తులకు దర్శనాలను బంద్ చేయనున్నారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం శుద్ది కార్యక్రమాలు నిర్వహించి ఆలయం తెరవనున్నారు.

Follow Us