AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా.. సేమ్‌ సీన్.. ఆ ఊర్లో ఏం జరుగుతుంది?

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గత కొద్ది రోజులుగా ఒక వింత సమస్య స్థానికులను వేధిస్తోంది. అర్ధరాత్రి కాగానే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాలనీలోని వీధి లైట్ల కనెక్షన్లను కట్ చేస్తూ జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇక దీంతో దుండగులను పట్టుకునేందుకు గ్రామంలోని యూత్‌ అంతా కలిసి ఓ ప్లాన్ వేశారు. రాత్రుళ్లు గస్తీ కాస్తు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా.. సేమ్‌ సీన్.. ఆ ఊర్లో ఏం జరుగుతుంది?
Nelakondapalli Street Light Issue
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 08, 2026 | 10:33 PM

Share

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. గత కొద్ది రోజులుగా రాత్రి అయిందంటే చాలూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలకు విద్యుత్ సరఫరా కాకుండా వీధి లైట్ల కనెక్షన్లను కట్ చేస్తున్నారు. ఎవరైనా గమనించి తిరిగి కనెక్షన్ ఇస్తే, మళ్లీ కొద్దిసేపటికే లైట్లను ఆపేస్తున్నారు. పంచాయతీ పరిధిలోని ఎస్సీ, బీసీ కాలనీల్లోనే ఈ సమస్య ఎక్కువ్వ అవ్వడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో రెండు వార్డులు పూర్తిగా అంధకారంలో మునిగిపోతున్నాయి.

రాత్రంతా కాలనీ యువత గస్తీ

అయితే కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తున్న ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు కాలనీ యువత స్వయంగా రంగంలోకి దిగింది. వార్డు సభ్యుడు కొడిరెక్క వినోద్ ఆధ్వర్యంలో యువకులంతా గ్రూపులుగా విడిపోయి రాత్రంతా కాలనీల్లో జల్లెడ పడుతున్నారు. నిందితులు దొరికే వరకు తెల్లవార్లు జాగారం చేస్తూ గస్తీ కాస్తామని యువత స్పష్టం చేసింది. ఈ వింత చేష్టల వల్ల కాలనీ ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. విద్యుత్, పంచాయతీ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీధి లైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, కాలనీల్లో రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us