AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie Yash Speech: నార్త్.. సౌత్.. అనే గొడవ వద్దు.. రాకింగ్ స్టార్ యశ్ స్పీచ్..

యశ్ టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నార్త్-సౌత్ విభజనను వ్యతిరేకించారు. దేశంలో ఎక్కడైనా కష్టపడితే ప్రేమ దక్కుతుందని, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్టీమ్‌బోట్ కథ ద్వారా ఎగతాళి చేసే వారి మాటలను పట్టించుకోకుండా, లక్ష్యం వైపు సాగితే విజయం సాధిస్తారని యువతకు స్ఫూర్తినిచ్చారు. ఆయన అనుభవంతో ఈ సందేశాన్ని పంచుకున్నారు.

Toxic Movie Yash Speech: నార్త్.. సౌత్.. అనే గొడవ వద్దు.. రాకింగ్ స్టార్ యశ్ స్పీచ్..
Yash
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 25, 2026 | 5:41 PM

Share

హీరో యశ్ తన తాజా చిత్రం టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ, దేశంలోని నార్త్-సౌత్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. “ఇండియన్ సిస్టంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అందరికీ తమ భాష అంటే చాలా ప్రేమ. అయితే, ప్రస్తుతం అందరూ కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది” అని యశ్ స్పష్టం చేశారు. ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూసే వారిని, లేదా ఈ అంశంపై రాజకీయాలు చేయాలనుకునే వారిని ఎవరూ పట్టించుకోవద్దని ఆయన ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను కోరారు.

“మీరు కష్టపడితే, మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా అదే ప్రేమ దొరుకుతుంది. మన దేశంలో ఎక్కడ నుంచి ఎవరైనా వచ్చి మంచి పని చేసినా, అంతే ప్రేమ మీరు ఇస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది” అని యశ్ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ఈ మాటలు ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి మానవత్వాన్ని, కృషిని గౌరవించాలని సూచిస్తాయి. తన సందేశానికి మరింత బలం చేకూర్చేందుకు, యశ్ ఒక చిన్న స్ఫూర్తిదాయక కథను పంచుకున్నారు. మొట్టమొదట స్టీమ్‌బోట్ ఇంజిన్‌ను ఆవిష్కరించినప్పుడు జరిగిన సంఘటనను ఆయన వివరించారు. “ఫస్ట్ టైం ఎవరో ఒక స్టీమ్‌బోట్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు, దే వాంటెడ్ టు షో ఇట్ టు ది హోల్ వరల్డ్ అంట. అప్పుడు అక్కడ ఉన్న సిటీలో ఎవ్రీబడీ వెంట్ టు విట్నెస్ ఇట్. కానీ విట్నెస్ చేసే వెళ్లే మనిషి అందరూ ఏం చెప్పారంట, అరే ఇది ఎలా జరుగుతుంది రా. ఇది ఎలా జరగొచ్చు. ఏదో స్టీమ్ అంట. ఆ స్టీమ్ తో బోట్ ముందు పోతుంది అని. థిస్ విల్ నెవర్ హ్యాపెన్ అని మాట్లాడుతూ, దే వర్ స్పీకింగ్ అబౌట్ ఇట్” అని యశ్ వివరించారు.

ప్రజలు స్టీమ్‌బోట్‌ను అనుమానించినా, అది మొదలైందని, ముందుకు కదిలిందని ఆయన గుర్తు చేశారు. “స్టార్ట్ అవ్వలేదురా, స్టార్ట్ అయ్యే ఛాన్సే లేదు అన్నవారు, అది స్టార్ట్ అయ్యాక నోరు మూయలేదు. మూవ్ అవ్వదు అన్నవారు, అది కదిలాక కూడా తమ మాట మార్చుకోలేదు. అది ఆగిపోదు, ఎక్కడో క్రాష్ అవుతుంది, మునిగిపోతుంది అన్నారు” అని యశ్ చెప్పగా, ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.

“సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ ఈజ్, లైఫ్‌లో, ఇన్ లైఫ్ మీరేం చేసేకి వెళ్లినా, ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ లిజన్ టు ఎనీబడీ. కీప్ గోయింగ్. సక్సెస్ విల్ బీ యువర్స్. విత్ మై ఎక్స్పీరియన్స్, ఐ హావ్ రియలైజ్డ్ దట్. సో, ఐ వుడ్ లవ్ టు షేర్ దట్ విత్ యు” అని యశ్ తన వ్యక్తిగత అనుభవాన్ని జోడించి యువతకు సందేశమిచ్చారు. జీవితంలో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకుండా, తమ లక్ష్యం వైపు దృఢంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ సందేశం సినీ రంగంలో, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు స్ఫూర్తినిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగింది.

Follow Us