తారక్ క్యారెక్టర్‌లో ట్విస్ట్..అలా యాక్సెప్ట్ చేస్తారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో, వింటేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఉత్సుకతను పెంచుతున్నాయి.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని, ఐదేళ్ల క్రితం ఈ కథ చెప్పినప్పుడు తారక్ అంగీకరించడానికి ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించబోతున్నామని నీల్ అన్నారు.డ్రాగన్ కథా నేపథ్యం 1960ల నాటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఓపియం వ్యాపారం చుట్టూ తిరుగుతుంది. ఈ మాఫియా నేపథ్యంలో సాగే కథలో, ఎన్టీఆర్ లుగర్ అనే క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

