చదువుకోవాలని ఉంది.. కాస్త బస్సు ఆపించండి సార్..ట్రాక్టర్లపై ప్రాణాలకు తెగించి ప్రయాణం!
మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థులు ఆర్టీసీ బస్సుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోగిపేట కాలేజీకి వెళ్లే బస్సులు ఆగకపోవడంతో బాలికలు కిలోమీటర్ల మేర నడుస్తుండగా, బాలురు ప్రాణాలకు తెగించి ట్రాక్టర్లపై ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలులో ఉన్నా విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
మెదక్ జిల్లా చిలిపిచేడు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్న రవాణా సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత చదువుల కోసం జోగిపేట కాలేజీకి వెళ్లాల్సిన వీరు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. జోగిపేట వెళ్లే బస్సులు నిండి వస్తున్నాయనే సాకుతో చిట్కుల్ గ్రామం వద్ద అసలు ఆగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో బాలికలు ప్రతిరోజూ దాదాపు 2 కిలోమీటర్ల మేర నడుస్తూ నర్సాపూర్ చౌరస్తాకు చేరుకోవాల్సి వస్తోంది. గత నాలుగు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతోందని, సమయానికి కాలేజీకి వెళ్లలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, బాలురు ప్రాణాలకు తెగించి, రోడ్డుపై వెళ్లే ట్రాక్టర్లను ఆపి, కనీస భద్రత లేకుండా ప్రమాదకరంగా వాటి వెనక వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు.ఈ ప్రాణసంకట ప్రయాణాలు స్థానికులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం, విద్యార్థుల బస్సుల పట్ల ఎందుకు శ్రద్ధ చూపడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
సౌత్ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్
నెలలోపే ఓటీటీలో… బిగ్ స్క్రీన్‌కు భారీ గండి
గేమ్ ప్లాన్ మార్చిన టాప్ బ్యూటీస్..
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

