తిరుపతి లీలామహల్ సెంటర్లో ఒక పానీపూరి బండిలో గ్యాస్ లీకై ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బండి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి సిలిండర్ పేలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.