దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం!
షూటింగ్ ముగించుకుని కేరళకు తిరిగి వస్తున్న మమ్ముట్టికి తమిళనాడులో అర్థరాత్రి అనూహ్య సమస్య ఎదురైంది. హైవే బ్లాక్ కావడంతో గూగుల్ మ్యాప్స్ సైతం సరైన దారి చూపకపోవడంతో ఆయన బృందం ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో పట్టమంగళం వద్ద పాండియన్ అనే యువకుడు వారికి సాయం చేశాడు. తన బైక్‌పై ముందుగా వెళ్లి సుమారు 10 కిలోమీటర్లు దారి చూపించాడు. అతని ఆప్యాయతకు మమ్ముట్టి ఫిదా అయ్యారు.
దైవభక్తికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన పవిత్ర పుణ్యక్షేత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి. కోనసీమ తిరుమలగా పిలువబడే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో రక్తం చిందించిన అమరవీరుల చారిత్రక నేల కూడా. 1931లో చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరిగిన వాడపల్లి రథోత్సవం నాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటుకే దారితీసింది. ఆనాడు ఉత్సవ రథానికి త్రివర్ణ పతాకాన్ని, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకుల చిత్రపటాలను అలంకరించారు. దీన్ని చూసి ఓర్వలేని బ్రిటిష్ పోలీసులు, రాజమండ్రి డి.ఎస్.పీ ముస్తఫా అలీ ఖాన్ ఆదేశాలతో రథంపై ఉన్న జాతీయ జెండాలను బలవంతంగా తొలగించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భక్తులు రథం ఎదుట మాడవీధుల్లో బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు. అయితే, విచక్షణ కోల్పోయిన బ్రిటిష్ అధికారి ముస్తఫా అలీ ఖాన్ నిరసనకారులపై తుపాకీ కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ మారణహోమంలో కరుటూరు సత్యనారాయణ, వాడపల్లి గంగాచలం, పాతపాటి వెంకటరాజుతో సహా నలుగురు దేశభక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ భక్తులు వెనుకంజ వేయకుండా బ్రిటిష్ పోలీసులపై తిరుగుబాటు చేశారు. భక్తుల ఉగ్రరూపానికి భయపడి ఆనాటి బ్రిటిష్ అధికారులు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ చారిత్రక పోరాటాన్ని చిరస్మరణీయం చేయడానికి ఆలయ ప్రధాన గోపురం ఎదుట స్మారక స్తూపాన్ని నిర్మించారు. నేటికీ వాడపల్లిని సందర్శించే భక్తులు ఈ అమరవీరుల స్థూపాన్ని దర్శించి ఘనంగా నివాళులు అర్పించడం ఇక్కడి ప్రత్యేకత.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
పసిడి ధర పైపైకి..ఇవాళ తులం గోల్డ్ ధర ఎంత పెరిగిందంటే!
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

