AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

Phani CH
|

Updated on: Aug 17, 2026 | 6:21 PM

Share

నెల్లూరుకు చెందిన 11 ఏళ్ల అనుముల నోమేష్‌ రూబిక్‌ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్‌ ఆర్ట్‌ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ చిత్రాలను రూపొందించిన నోమేష్‌.. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 104 రూబిక్‌ క్యూబ్స్‌తో ఎర్రకోట, జాతీయ జెండా, స్వాతంత్ర్య సమరయోధులు, జవాన్ల చిత్రాలను తీర్చిదిద్దాడు. కేవలం 1 గంటా 55 నిమిషాల 55 సెకన్లలో ఈ అద్భుతాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

చదువుకుంటూనే అద్భుతాలు సృష్టిస్తున్న ఓ చిచ్చరపిడుగు తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నెల్లూరు జిల్లా రూరల్ పరిధిలోని బ్యాంక్ కాలనీకి చెందిన 11 ఏళ్ల అనుముల నోమేష్.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎయిమ్స్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ కుర్రాడు.. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ చిత్రాలను రూబిక్ క్యూబ్స్‌తో తీర్చిదిద్ది ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నోమేష్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఎర్రకోటపై రెపరెపలాడే మువ్వన్నెల జెండాతో పాటు, స్వాతంత్ర్య సమరయోధులు, జవాన్ల చిత్రాలను రూబిక్ క్యూబ్స్‌పై కళ్లకు కట్టాడు. కేవలం గంటా 55 నిమిషాల 55 సెకండ్లలోనే 104 రూబిక్ క్యూబ్స్‌ను అమర్చి అందరినీ విస్మయపరిచాడు. నిమిషాల వ్యవధిలో రంగుల క్యూబ్స్‌ను మార్చుతూ మహాత్ముల చిత్రాలను సృష్టించడం అతని అంకితభావానికి నిదర్శనం. తాను రూపొందించిన ఈ అద్భుతమైన ఆర్ట్‌ను దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు, అమర జవాన్లకు నోమేష్ అంకితమిచ్చాడు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఈ సూపర్‌బాయ్‌ను స్థానికులు, ప్రముఖులు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్థరాత్రి హైవేపై దారి తప్పిన స్టార్ హీరో.. గుర్తుపట్టి దారి చూపిన యువకుడు

దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం!

రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్‌ కోబ్రాలు..

పసిడి ధర పైపైకి..ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంత పెరిగిందంటే!

ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!

Follow Us