భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ కుక్క, కోతి కలిసి ఆడుకున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. తమ జాతి వైరాన్ని మరిచి, స్నేహితుల్లా ఐదు నిమిషాల పాటు ఆడుకున్న ఈ మూగజీవాల మైత్రి మానవాళికి గొప్ప సందేశాన్ని అందించిందని స్థానికులు ప్రశంసించారు.