రహదారుల పై గజరాజుల బీభత్సం వీడియో
మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ఏనుగుల గుంపు స్థానిక ప్రజలు, రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రధాన రహదారులపైకి వస్తూ హల్‌చల్ చేస్తున్న ఏనుగుల కారణంగా, వానాకాలం సాగు పనులకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఒక ఏనుగు గుంపు నుంచి విడిపోవడంతో ప్రత్యేక నిఘా పెట్టారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ఏనుగుల గుంపు స్థానిక ప్రజలు, రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు ప్రధాన రహదారులపైకి వస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు, ఏటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయోనని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వానాకాలం సాగు సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఉదయం నుంచే పొలం పనుల్లో నిమగ్నమవుతుంటారు. అయితే, ఈ ఏనుగుల సంచారం అధికంగా ఉండటంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు చెండాల, విహిరిగావ్, గురువాలా వంటి అటవీ పరిసర గ్రామాల్లో ఏనుగుల గుంపు కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, అధికారులు రంగంలోకి దిగి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పొలాలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు రైతులు, కూలీలు సమూహాలుగా వెళ్లాలని, ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏనుగుల గుంపు నుంచి ఒక ఏనుగు దారి తప్పి విడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరిగా ఉన్న ఆ ఏనుగు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో, దాన్ని తిరిగి గుంపులో కలిపేందుకు అటవీ శాఖ ప్రత్యేక సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏనుగుల దాడుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
సౌత్ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్
నెలలోపే ఓటీటీలో… బిగ్ స్క్రీన్‌కు భారీ గండి
గేమ్ ప్లాన్ మార్చిన టాప్ బ్యూటీస్..
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

