AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత

ఆక్రమణల పర్వంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడాలంటూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో, ఓ రాజకీయ నాయకుడు వినూత్న పంథాలో నిరసన తెలియజేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఆక్రమణలపై అధికారుల ఉదాసీనతను ఎండగట్టేందుకు ఆయన ఎంచుకున్న మార్గం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకూ అతనేం చేశాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత
Government Land Encroachment
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 08, 2026 | 11:16 PM

Share

ముదినేపల్లి మండలం వనుదుర్రు శివారు కొత్తపల్లిలోని పంచాయతీ మంచినీటి పథకానికి కేటాయించిన స్థలంలో ఈ ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో మంచినీటి చెరువు కట్టపై ఐదు ఇళ్లు, ఒక పశువుల పాకతో పాటు వాటికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రజా ప్రయోజనార్థం ఉద్దేశించిన మంచినీటి చెరువు అపవిత్రమవుతోందని, వీటిని తక్షణమే తొలగించాలని కోరుతూ జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సభ్యుడు మట్టపూడి మదన్‌కుమార్ గత కొంతకాలంగా అధికారులకు అనేక వినతిపత్రాలు అందజేశారు. అయినప్పటికీ, సంబంధిత యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన కరువైంది.

ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ.. మదన్‌కుమార్ సోమవారం తన భార్యతో కలిసి అదే వివాదాస్పద మంచినీటి చెరువు స్థలంలో ఇళ్లను నిర్మించుకునేందుకు స్వయంగా ‘భూమి పూజ’ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఆయన ప్రత్యేకంగా ‘మంచినీటి చెరువు స్థలంలో గృహ నిర్మాణం’ అంటూ ఆహ్వాన పత్రికలను ముద్రించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వినూత్న వివాహ తరహా ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

ఈ సందర్భంగా మదన్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో అధికారులు వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. నిరసనగా తాము భూమి పూజ చేసినా అధికారులలో కదలిక రాకపోవడం దారుణమన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆక్రమణలపై మరోమారు జిల్లా కలెక్టర్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక బాధ్యతాయుతమైన నిరసనగా సాగిన ఈ భూమి పూజ ఉదంతం స్థానిక రెవెన్యూ, పంచాయతీ వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే