వామ్మో.. ఎటు చూసినా పాములే.. భయంతో వణకిపోతున్నారు!
రుతుపవనాలతో కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నా, పాముల బెడద భయం కలిగిస్తోంది. చల్లబడిన భూమి, కప్పలు, ఎలుకల సంచారం పెరగడంతో పాములు జనావాసాల్లోకి, పొలాల్లోకి వస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రైతులు, పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
రుతుపవనాల రాకతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నా, మరోవైపు పాముల రూపంలో అందరిలోనూ భయం మొదలైంది. ఇన్నాళ్లూ ఎండ వేడికి భూగర్భంలో, పుట్టల్లో, బండల కింద దాక్కున్న పాములు, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూమి చల్లబడటంతో ఒక్కసారిగా జనావాసాల్లోకి వస్తున్నాయి. వీటికి తోడు కప్పలు, ఎలుకల సంచారం పెరగడంతో, వాటి వేటలో పాములు ఇళ్లు, పొలాలు, కాలనీల పరిసరాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్లతో పాటు రామగుండం, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాల్లో పాముల సంచారం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం వానాకాలం సీజన్లో రైతులు వరినాట్లు, ఇతర వ్యవసాయ పనుల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాల్లోనే గడుపుతున్నారు. గడ్డిలో, నీటిలో దాక్కున్న పాములను గమనించకుండా కాలు వేయడం వల్ల పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే చేతిలో కర్ర పట్టుకుని ప్రతి అడుగు భయంగానే వేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
సౌత్ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

