AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తే ఆత్మ పరిస్థితి ఏమిటంటే..

అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి విశేష ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణానికి శ్రీ మహా విష్ణువు అధిపతి. ఇందులో మానవ జీవితం గురించి మాత్రమే కాదు.. మరణం అనంతరం జీవి ప్రయాణం.. గురించి కూడా వివరంగా వివరించారు. ఇందులో దహన సంస్కార ప్రక్రియ, నమ్మకం, ముఖ్యమైన అంశాలను వివరించారు. మరణం తర్వాత మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు వదిలివేయకూడదు.. అంత్యక్రియల తర్వాత ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదో వివరించింది.

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తే ఆత్మ పరిస్థితి ఏమిటంటే..
Garuda Purana
Surya Kala
|

Updated on: May 01, 2025 | 4:48 PM

Share

గరుడ పురాణం జననం నుంచి మరణం వరకు పదహారు ఆచారాల గురించి వివరంగా వివరించింది. ఇందులో పదహారవ.. అంతిమ కర్మలు దహన సంస్కారాలు. అంత్యక్రియల కోసం అనేక రకాల నియమాలు పేర్కొన్నాయి. ఈ పురాణాన్ని మహర్షి వేద వ్యాసుడు రచించాడు. ఈ గరుడ పురాణం శ్రీ మహా విష్ణువు.. తన భక్తుడైన పక్షి రాజు గరుత్ముండికి మధ్య సంభాషణ. గరుడ పురాణం కుటుంబ సభ్యులు మరణానంతరం ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో చెబుతుంది. ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుంది? ఎవరు స్వర్గాన్ని పొందుతారు? ఎవరు నరకానికి వెళతారు. జీవులకు పునర్జన్మ దేని ఆధారంగా లభిస్తుంది? ఈ పురాణంలో మరణానంతరం అంత్యక్రియలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు చేయకూడదో వ్రాయబడింది. ఈ రోజు సూర్యాస్తమం తర్వాత మృతదేహానికి ఎందుకు అంత్యక్రియలు చేయరాదో తెలుసుకుందాం..

రాత్రి ఎందుకు అంత్యక్రియల చేయరంటే..

గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మృతదేహాన్ని దహనం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభించదని అంటారు. సూర్యాస్తమయం తర్వాత స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయనే నమ్మకం కూడా ఉంది. దీని కారణంగా ఆత్మ తన గమ్యాన్ని చేరుకోలేకపోతుంది.

సూర్యాస్తమయం తర్వాత నరకం ద్వారాలు తెరుచుకుంటాయి. అటువంటి పరిస్థితిలో మరణించిన వ్యక్తిని రాత్రి సమయంలో దహనం చేస్తే.. అతని ఆత్మ నరక బాధను అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు ఇలా సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు జరిపిన వ్యక్తి మరు జన్మలో శరీర భాగాలలో దేనిలోనైనా లోపంతో జన్మించే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ఎవరికైనా సరే ఎటువంటి పరిస్తితిల్లోనూ రాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించరు.

ఇవి కూడా చదవండి

దహన సంస్కారాలు ఎవరు చేయవచ్చు?

గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి మృతదేహాన్ని సూర్యోదయం వరకు నేలపై ఉంచాలి. ఉదయం అతని అంత్యక్రియలు తగిన ఆచారాలతో నిర్వహించాలి. ఈ అంత్యక్రియలను తండ్రి, కొడుకు, సోదరుడు, మనవడు లేదా కుటుంబంలోని ఏ పురుష సభ్యుడైనా చేయవచ్చు. గరుడ పురాణంలో అంత్యక్రియలు కుటుంబ సంప్రదాయంలో ఒక భాగమని ప్రస్తావించబడింది. అందువల్ల జీవితాంతం వంశపారంపర్యంగా సంబంధం కలిగి ఉన్న వారికి మాత్రమే దహన సంస్కారాలను చేసే హక్కు ఇవ్వబడింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు