Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
మేషం వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభం వారు వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. మిథునం వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొన్ని అదనపు బాధ్యతల్ని కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు ప్రోత్సాహక రంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. రావలసిన డబ్బు కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు తనంతో వ్యవహరించవద్దు. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతాయి. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల వివాదాల్లో కల్పించుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిదానంగా పురోగమిస్తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్ని చాలావరకు చక్కబెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. హోదాలు, బాధ్యతలు మారే అవ కాశం ఉంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. ఒకరిద్దరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు లాభాలపరంగా బాగా పురోగతి చెందు తాయి. ఆదాయం వృద్ధి చెందే సూచనలున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావల సిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపె ట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బంధువుల్ని ఆదుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభి స్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) అదనపు బాధ్యతలు, పని భారం ఉన్నప్పటికీ ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పను లన్నీ పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యు లతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
థనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యమైన బాధ్యతలు, లక్ష్యాలను సకాలం పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులకు ఆర్థి కంగా సహాయపడతారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరు గుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహరంగా సాగిపోతుంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదా యానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవు తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యో గాల్లో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహాలు లభిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తి, వ్యాపారాలు కొద్దిగా లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.