AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి.. అమెరికా డాక్టర్లు ఏమంటున్నారంటే..?

ఏ ముహూర్తాన ఎవరో చెప్పారో కానీ.. ఉదయాన్నే వేడినీళ్లు తాగితే కొవ్వు ఐసు ముక్కలా కరిగిపోతుందని మనమంతా ఫిక్స్ అయిపోయాం. అందుకే పొగలు గక్కే గ్లాసు పట్టుకుని గొంతు కాల్చుకుంటూ కూడా తాగుతుంటాం. నిజంగా వేడీ నీళ్ల వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయా..? అసలు డాక్టర్లు ఏమంటున్నారు? ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..

ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి.. అమెరికా డాక్టర్లు ఏమంటున్నారంటే..?
Benefits Of Drinking Warm Water Morning
Krishna S
|

Updated on: Mar 15, 2026 | 10:05 PM

Share

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు వేడినీరు తాగడం అలవాటు చేసుకుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, బరువు తగ్గిస్తుందని ఒక నమ్మకం. అయితే వేడినీరు నిజంగానే అద్భుతాలు’ చేస్తుందా? లేక ఇదంతా కేవలం ఒక మానసిక తృప్తి మాత్రమేనా..? అమెరికాకు చెందిన హఫ్‌పోస్ట్ నివేదిక, వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జీర్ణక్రియకు సహాయపడుతుందా?

అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఇసయ్య షుస్టర్ అభిప్రాయం ప్రకారం.. వేడి పానీయాలు జీర్ణవ్యవస్థలోని కండరాలను కొంతవరకు సడలిస్తాయి. దీనివల్ల ఆహారం అన్నవాహిక ద్వారా సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఇది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్‌ను ప్రేరేపించడం ద్వారా పెద్ద ప్రేగు కదలికలను పెంచుతుంది. తద్వారా మలబద్ధకం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గుతారనేది నిజమేనా?

చాలామంది నమ్మే మరో విషయం.. వేడినీరు తాగితే కొవ్వు కరుగుతుందని. కానీ చికాగో యూనివర్సిటీ మెడిసిన్ డాక్టర్ వెనెస్సా బుయ్ ప్రకారం.. దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. మన శరీరం సాధారణంగా 37 డిగ్రీల సెల్సియస్ వద్ద మెరుగ్గా పనిచేస్తుంది. మరీ ఎక్కువ వేడి లేదా అతి చల్లని నీరు తాగడం వల్ల కొన్నిసార్లు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. బరువు తగ్గడం అనేది కేవలం నీటి ఉష్ణోగ్రత మీద కాకుండా మన జీవనశైలి, నిద్ర, హార్మోన్ల పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

నీటి ఉష్ణోగ్రత కంటే ఏది ముఖ్యం?

వైద్యుల సలహా ప్రకారం.. నీరు ఏ ఉష్ణోగ్రతలో తాగుతున్నామనే దానికంటే.. రోజంతా శరీరాన్ని ఎంత హైడ్రేటెడ్‌గా ఉంచుతున్నామనేది ముఖ్యం. మీరు వేడినీరు తాగడం వల్ల కూల్ డ్రింక్స్ లేదా షుగర్ ఎక్కువగా ఉండే పానీయాలకు దూరంగా ఉంటే అది పరోక్షంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తే.. ఆ అలవాటును కొనసాగించడంలో తప్పు లేదు. కానీ అది ఏదో ఒక మాయ చేస్తుందని ఆశించడం మాత్రం భ్రమ మాత్రమే.

నిపుణుల సూచన

అతి వేడి లేదా అతి చల్లని నీటి కంటే, శరీరానికి సౌకర్యవంతంగా ఉండే ఉష్ణోగ్రతలో నీరు తాగడం మంచిది. జీర్ణక్రియ మెరుగుపడాలంటే కేవలం నీటిపైనే కాకుండా సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

Follow Us
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
పెళ్లిలో తింటుండగా గొంతులో ఇరుకున్న రసగుల్ల.. ఆ తర్వాత ..
పెళ్లిలో తింటుండగా గొంతులో ఇరుకున్న రసగుల్ల.. ఆ తర్వాత ..