ఖాళీ కడుపుతో గ్లాసుడు గోరు వెచ్చని నీళ్లలో ఇది ఓ స్పూన్ కలిపి తాగితే..
15 March 2026
TV9 Telugu
TV9 Telugu
ప్రకృతి మనకు అందించిన సహజసిద్ధమైన ఆహారాల్లో తేనె అద్భుతమైన ఆహారం. ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మూలికలతో దీన్ని కలిపి తీసుకుంటే ఎన్నో రోగాలు నయమవుతాయి
TV9 Telugu
తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఇందుకు కారణం. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఈ సీజన్‌లో మనకు కలిగే వ్యాధులను తగ్గించడంలో సహాయం చేస్తాయి
TV9 Telugu
తేనెను రోజూ ఉదయం పరగడుపున ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి కూడా తేనెను తీసుకోవచ్చు
TV9 Telugu
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక రకాల బి విటమిన్లు, విటమిన్ సి, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి
TV9 Telugu
ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. రోజూ ఉదయం పరగడుపునే తేనె తీసుకోవడం వల్ల శరీరం వ్యాధి నిరోధకశ శక్తిని పెంచుకుని రోగాలు, ఇన్ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
తేనె దగ్గుకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు పూటకు ఒక టీస్పూన్ చొప్పున తేనెను తీసుకుంటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది
TV9 Telugu
అలాగే జలుబు, గొంతులో గరగర, మంట, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. తేనెను తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ నుంచి కోలుకుంటారు
TV9 Telugu
జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. తేనె శరీరానికి సహజసిద్ధంగా శక్తిని అందిస్తుంది. ఉదయం తేనెను తీసుకోవడం వల్ల శరీరం ఉత్సాహంగా మారుతుంది. చురుగ్గా ఉంటారు. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట తగ్గుతాయి