పుచ్చకాయ తిన్న వెంటనే టీ , కాఫీలు తాగుతున్నారా.. అయితే మీ కథ కంచికే!

Samatha

15 march 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు, చాలా మంది పుచ్చకాయ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ పుచ్చకాయ ఇష్టంగా తింటారు.

పుచ్చకాయ

ఎండాకాలంలో పుచ్చకాయ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. నీరసాన్ని తగ్గిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

అయితే కొంత మంది పుచ్చకాయ తిన్న వెంటనే కాఫీ, లేదా టీ తాగుతుంటారు. కానీ ఇలా తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

టీ, కాఫీలు

అయితే పుచ్చకాయ తిన్న వెంటనే కాపీ, లేదా టీ తాగడం వలన ఎలాంటి సమస్యలు దరి చేరుతాయి. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

అనారోగ్య సమస్యలు

పుచ్చ కాయ తిన్నవెంటనే టీ లేదా కాఫీ తాగడం వలన జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అజీర్ణం, ఎసిడీటీ, గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉన్నదంట.

జీర్ణ సమస్యలు

అలాగే పుచ్చకాయలో ఎక్కువగా నీరు ఉంటుంది. అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వలన ఇది కొంత మందిలో తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలకు కారణం అవుతుంది.

కడుపు నొప్పి

అంతే కాకుండా, పుచ్చకాయ తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం వలన కొంత మందిలో పొడి దగ్గు, ఛాతిలో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంట.

ఛాతిలో మంట

అందువలన పుచ్చకాయ తిన్న వెంటనే టీ, కాఫీలు అస్సలే తీసుకోకూడదంట. ముఖ్యంగా వీలైనంత వరకు వేడివి తీసుకోకపోవడమే మంచిది. 30 నిమిషాల గ్యాప్ తర్వాత టీ తాగినా ఎలాంటి చెడు ప్రభావం ఉండదంట.

టీ, కాఫీ