AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: చంద్ర బలంతో ఆ రాశుల వారికి డబ్బే డబ్బు! ఇందులో మీ రాశి ఉందా..?

2025లో చంద్రుని బలం ఆధారంగా ఈ ఏడాది ఏయే రాశుల వారికి మేలు జరగనుందో ఇక్కడ వివరించడం జరిగింది. మేషం, వృషభం, కర్కాటకం సహా మరికొన్ని రాశుల వారికి చంద్రుడు అత్యంత అనుకూలంగా ఉంటాడు. ధనవృద్ధి, ఆరోగ్య పురోగతి, ఉద్యోగంలో పదోన్నతి, విదేశీ యోగాలు లాంటి అంశాలను ఈ వ్యాసం వివరిస్తుంది. ఏయే రాశి వారికి చంద్రుడు లబ్ధి చేకూర్చబోతున్నాడో తెలుసుకోండి.

Money Astrology: చంద్ర బలంతో ఆ రాశుల వారికి డబ్బే డబ్బు! ఇందులో మీ రాశి ఉందా..?
Money Astrology 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 09, 2025 | 3:22 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు రాజయోగ కారకుడు. మనసులోని కోరికలు నెరవేరాలన్నా, జీవితం ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా సాగాలన్నా జాతక చక్రంగా చంద్రుడికి బలం ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని రాశుల్లో చంద్రుడికి సహజసిద్ధంగా విశేషమైన బలం కలుగుతుంది. అవిః చంద్రుడికి మిత్ర క్షేత్రమైన మేషం, ఉచ్ఛ రాశి అయిన వృషభం, స్వస్థానమైన కర్కాటకం, సౌకర్యవంతమైన తుల, గురు స్థానాలైన ధనుస్సు, మీన రాశులు. ఈ రాశులవారికి ఏదో విధంగా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటాడు. అధికారాన్ని కలిగిస్తాడు. ఈ ఏడాది చివరి లోపు చంద్రుడు వీరిని అనేక విధాలుగా అందలాలు ఎక్కించే అవకాశం ఉంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు చంద్రుడికి ప్రాణమిత్రుడైనందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికలను తీర్చ డంలో చంద్రుడు ముందుంటాడు. రాశ్యధిపతి కుజుడితో చంద్రుడు కలిసినప్పుడల్లా సంపదను వృద్ధి చేయడం జరుగుతుంటుంది. ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడం జరుగుతుంది. ఈ ఏడాదంతా చంద్రుడు ఈ రాశివారికి అనుకూలంగా ఉండబోతున్నందు వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలిగించడంతో పాటు, విదేశీ యోగాలు పట్టించే అవకాశం కూడా ఉంది.
  2. వృషభం: ఈ రాశి తనకు ఉచ్ఛ స్థితిని కలిగించే రాశి అయినందువల్ల ఈ రాశివారికి చంద్రుడు అత్యంత శుభప్రదుడుగా మారుతాడు. చంద్రుడి అనుగ్రహం వల్ల ఈ రాశివారికి ఈ ఏడాదంతా ఏదో విధంగా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసి రావడంతో పాటు సొంత ఇల్లు అమరే అవ కాశం కూడా ఉంది. చంద్రుడు ఔషధ కారకుడు కూడా అయినందువల్ల ఈ రాశివారి అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది. వీరి మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశి చంద్రుడికి స్వస్థానమైనందువల్ల ఈ రాశిని ఈ ఏడాది ఈ గ్రహం అనేక విధాలుగా ఆదుకోవడంతో పాటు ఉచ్ఛ స్థితికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విస్తృతంగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికల్లో చాలావరకు నెరవేరుతాయి. మాతృ సౌఖ్యం లభించడంతో పాటు తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని వృద్ధి ఉంటుంది.
  4. తుల: చంద్రుడికి అత్యంత ఇష్టమైన రాశుల్లో తులా రాశి ముందు వరుసలో ఉంటుంది. ఏమాత్రం అనుకూలంగా ఉన్నా ఈ రాశివారికి చంద్రుడు ఇవ్వని యోగం ఉండదు. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం తులా రాశివారికి ఎక్కువగా ఉంటాయి. ఏ రకమైన వృత్తి, వ్యాపారాల్లో ఉన్నా వీరు తప్ప కుండా ముందుకు దూసుకుపోతారు. సామాజికంగా పేరు ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు కలిగి ఉంటారు. అతి చిన్న వయసులోనే ఐశ్వర్యవంతులు కావడం జరుగుతుంది.
  5. ధనుస్సు: చంద్రుడికి గురువైన బృహస్పతికి సంబంధించిన రాశి అయినందువల్ల ఈ రాశివారిని చంద్రుడు అనేక విధాలుగా అందలాలు ఎక్కిస్తాడు. తక్కువ ప్రయత్నంతో ఆదాయపరంగా, అధికారపరంగా ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం కల్పిస్తాడు. సాధారణ వ్యక్తి సైతం ఈ ఏడాది చంద్రుడి కటాక్షం వల్ల సంపన్నుడయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
  6. మీనం: ఈ రాశికి కూడా బృహస్పతే అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఏలిన్నాటి శని దోషం ఉన్నప్పటికీ తమ తమ రంగాల్లో ఉన్నత స్థితికి దూసుకుపోయే అవకాశం ఉంది. ఈ రాశివారి మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలన్న కల నెరవేరుతుంది. సొంత ఇంటిని అమర్చుకునే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో ఘన విజయం సాధిస్తారు.