AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: ఏలి నాటి శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. శనీశ్వర అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేసి చూడండి..

జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నవ గ్రహాల్లో శనీశ్వరుడుకి ప్రత్యేక స్థానం ఉంది. ఎవరి జాతకంలోనైనా మందగమనుడు బలహీనంగా ఉంటే వారి జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా ఏలి నాటి శని, శని దోషంతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే శని అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేక నివారణ చర్యలు సహాయపడతాయి. వారి జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

Lord Shani: ఏలి నాటి శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. శనీశ్వర అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేసి చూడండి..
Lord Shani Dev
Surya Kala
|

Updated on: May 09, 2025 | 3:59 PM

Share

హిందూ మతంలో జీవితంలోని అన్ని సంఘటనలు మన జాతకంలో ఉన్న గ్రహాల స్థానం ఆధారంగా జరుగుతాయి. జాతకంలో గ్రహాల స్థానాలు మారడం వల్ల జీవితంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉంటాయి. హిందూ మత గ్రంథాల ప్రకారం శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. శనీశ్వరుడు మనుషులకు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అయితే జన్మ కుండలిలోని శని దోషం ఉంటే ముఖ్యమైన పనిలో అడ్డంకులు సృష్టిస్తుంటే.. చేపట్టిన పనులకు తగిన ఫలితం పొందకపోతే జీవితంలో ఏలి నాటి శని లేదా శని ధైయ్యం తో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రజలు మంచి పనులు చేయకుండా, సరైన మార్గంలో రాకుండా నిరోధించడానికి శనీశ్వరుడు వారి జీవితాల్లో అనేక అడ్డంకులను సృష్టిస్తాడు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడిని పూజించడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. దీనితో పాటు జీవితంలో సానుకూల శక్తిని సృష్టిస్తుంది. పనిలో పురోగతి సాధించడానికి సహాయపడుతుంది. ఎవరి జాతకంలో శనీశ్వరుడిని ఏలి నాటి దశ జరుగుతున్నా.. శని స్థానం కారణంగా బాధపడుతున్నా.. ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక నివారణలను ప్రయత్నించండి. ఈ చర్యలన్నీ తీసుకోవడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలను అధిగమించడానికి, మీ జీవితంలో పురోగతి సాధించడానికి కూడా మీకు సహాయపడుతుంది.

శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు మార్గాలు

  1. శనివారం శనీశ్వరుడి రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజించండి.
  2. శనివారం శని ఆలయానికి వెళ్లి అతని విగ్రహానికి ఆవ నూనెను సమర్పించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. శనివారం రోజు రాత్రి చంద్రుని ముందు ఆవాల నూనె దీపం వెలిగించి.. అందులో నల్ల నువ్వులు, నల్ల మినపప్పు వేయండి.
  5. “ఓం శం శనిశ్చరాయ నమః” అనే శని మంత్రాన్ని తప్పకుండా జపించండి.
  6. ఖచ్చితంగా పేదలకు సేవ చేయండి, నల్ల బూట్లు, చెప్పులు, దుప్పట్లు దానం చేయండి.
  7. శనివారం నాడు నల్ల నువ్వులు, ఇనుము, మినపప్పు, నూనె దానం చేయండి.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

పురాణ మత గ్రంథాల ప్రకారం శనివారం శనీశ్వరుడిని పూజించడం ద్వారా జీవితంలో మంచి జరగడం ప్రారంభమవుతుంది. కొన్ని ప్రత్యేక నివారణలు ప్రభావవంతంగా పని చేస్తాయి. జీవితంలోని అన్ని సమస్యలను తగ్గడం మొదలవుతాయి. జీవితాంతం మంచి పనులు చేసే వారి పట్ల, ఎటువంటి తప్పులు చేయని వారి పట్ల శనీశ్వరుడు ఎల్లప్పుడూ అనుగ్రహంతో ఉంటాడు.

శని అనుగ్రహం కోసం జీవితంలో చెడు సహవాసానికి దూరంగా ఉండాలని.. జీవితాంతం దేవుడిని ఆరాధించడం, దానధర్మాలు చేయడం కొనసాగించాలని పురాణ మత గ్రంథాలలో చెప్పబడింది. గ్రంథాల ప్రకారం, శనీశ్వరుడి ప్రతి రూపంగా భావిస్తారు. అందుకే శనిదేవుడితో పాటు మహాదేవుడిని పూజిస్తాడు. శివుడిని నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా