AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాలు: ఏ రాశి విద్యార్థులకు అదృష్టం? ఏ రాశులకు కష్టకాలం?

Education Horoscope 2026: పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలితాలను జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఏడాది వివిధ రంగాల వారికి ఎలా ఉండబోతుందో చెప్పినట్లే, విద్యార్థులపై ఈ సంవత్సర ప్రభావం ఎలా ఉంటుందో కూడా వివరించారు. మరి 12 రాశుల విద్యార్థులకు ఈ ఏడాది ఎలా ఉండబోతోందో చూద్దాం..

పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాలు: ఏ రాశి విద్యార్థులకు అదృష్టం? ఏ రాశులకు కష్టకాలం?
Students Horoscope
Rajashekher G
|

Updated on: Mar 19, 2026 | 8:11 PM

Share

పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలితాలను జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇప్పటికే వెల్లడించారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరంలో కూడా గ్రహస్థితులు, నక్షత్రాల మార్పులు మనుషుల జీవితాలపై ప్రభావం చూపనున్నాయని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం వంటి విభిన్న రంగాలతో పాటు విద్యార్థుల భవిష్యత్తుపై కూడా ఈ సంవత్సర ప్రభావం ఎలా ఉండబోతుందో విశ్లేషించారు. ప్రత్యేకంగా విద్యార్థుల విషయంలో ఈ సంవత్సరం కీలకంగా ఉండనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొంతమంది రాశుల వారికి చదువులో మంచి పురోగతి, పరీక్షల్లో విజయాలు, విదేశీ విద్యావకాశాలు లభించే సూచనలు ఉన్నాయని తెలిపారు. మరికొంతమంది విద్యార్థులు మాత్రం ఏకాగ్రత లోపం, ఆలస్యాలు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే క్రమశిక్షణ, కృషి, సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.

  • ఇక కొన్ని రాశుల వారికి ఈ సంవత్సరం కొంత కష్టసాధ్యంగా ఉండొచ్చు. చదువులో ఆసక్తి తగ్గడం, దృష్టి చెదరడం, అనుకున్న ఫలితాలు రాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అలాంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగితే ఫలితాలు తప్పకుండా మెరుగుపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
  • మేష రాశి: ఈ రాశి విద్యార్థులకు అనుకూల సమయం. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగితే మంచి విజయాలు సాధిస్తారు.
  • వృషభ రాశి: మీరు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. చదువులో స్థిరత్వం పెరిగి, మంచి ఫలితాలు అందుకుంటారు.
  • మిథున రాశి: శుభ ఫలితాలు పొందే సంవత్సరం ఇది. ముఖ్యంగా విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
  • కర్కాటక రాశి: మధ్యస్థ ఫలితాలు. “కష్టే ఫలి” అనే సూత్రాన్ని నమ్మాలి. ఎంత కష్టపడి చదివితే అంత మంచి ఫలితం పొందగలుగుతారు.
  • సింహ రాశి: ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యలో అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.
  • కన్యా రాశి: అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
  • తులా రాశి: ఈ సంవత్సరం మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీ అవకాశాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి.
  • వృశ్చిక రాశి: చదువులో మీ కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. విదేశీ విద్యకు చేసే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి.
  • ధనుస్సు రాశి: మిశ్రమ ఫలితాలు. కాస్త కష్టపడి, ఆసక్తితో చదివితే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
  • మకర రాశి: విద్యా పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
  • కుంభ రాశి: అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధించవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే సోమరితనం వదిలితేనే ఈ విజయాలు సాధ్యమవుతాయి.
  • మీన రాశి: ఈ సంవత్సరం ఏకాగ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చదువుపై దృష్టి పెంచడం అవసరం. సరస్వతీ బీజాక్షరాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us