AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతలు

భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతలు

యుద్ధమంటే బాంబుల వర్షం కురిపించడం, శతఘ్నులను గురిపెట్టడమా? విమానాలు శత్రు దేశంపైకి దూసుకెళ్తేనే సమరం మొదలైనట్లా? క్షిపణులు ఎక్కుపెడితేనే సమరభేరి మోగినట్టా? కానే కాదు.. ఎందుకంటే ఇది కత్తులు దూసే కాలం కాదు. విల్లంబులు సంధించే యుద్ధాలు కావు. రక్తం కళ్లజూస్తేనే, శత్రువు లొంగిపోతేనే విజయమనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. బొందిలో ప్రాణమున్నా ఊపిరి ఆపేయొచ్చు. బలప్రయోగం చేయకుండానే కాళ్లూచేతులు కట్టేయొచ్చు. పాకిస్తాన్‌ విషయంలో ఇప్పుడు భారత్‌ చేస్తోంది అదే. ఆ లెక్కన పాకిస్తాన్‌పై భారత్‌ ఎప్పుడో వార్‌ స్టార్ట్‌ చేసింది. వరుస స్ట్రయిక్స్‌తో దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది.

వాటర్‌ స్ట్రయిక్‌తో పాకిస్తాన్‌పై యుద్ధం మొదలుపెట్టేసింది భారత్‌. సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దుచేయడం శత్రువు ఊహకైనా అందని మేజర్‌ ఎటాక్‌. ఇప్పుడా నదిపై ఆరు జలవిద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించబోతోంది మేరా భారత్‌. సింధూ ఒప్పందం ప్రకారం ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఆరు నెలల ముందు పాకిస్తాన్‌తో షేర్‌ చేసుకోవాలి. కానీ ఒప్పందమే రద్దయిపోవటంతో పాకిస్తాన్‌కి చెప్పడానికేం లేదు.. చేసుకుంటూ పోవడమే. చీనాబ్‌ నదిపై సలాల్‌ డ్యామ్‌, బాగ్లిహార్‌ డ్యామ్‌ గేట్లను మూసేయటంతో పాకిస్తాన్‌ గొంతు ఎండటం మొదలైంది.

పాకిస్తాన్‌కు ఇప్పటికే అన్ని రకాల ఎగుమతులను నిలిపివేసి వాణిజ్యపరంగా ఆంక్షలు విధించింది భారత్‌. దాయాది దేశంనుంచి అన్ని దిగుమతులూ నిలిపేసింది. పాకిస్తాన్‌తో సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. అటు దౌత్యపరంగా కూడా పాక్‌ని ముప్పు తిప్పలు పెడుతోంది. పాకిస్తాన్‌కు ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్యాకేజీ ప్రకటించిన ఐఎంఎఫ్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఏడీబీ బ్యాంక్‌ అధ్యక్షుడితో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు నిధులు ఇవ్వొద్దని కోరారు కేంద్రమంత్రి. మరోవైపు.. పాకిస్తాన్‌ మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోకి వెళ్లేలా మన దేశం ఒత్తిడి తీసుకొస్తోంది.

పాక్ నుంచి భారత్‌కు వచ్చే అన్ని మెయిల్స్‌, పార్సిళ్ల ఎక్స్ఛేంజీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉక్రోషంతో రగిలిపోతున్న పాకిస్తాన్‌ క్షిపణి ప్రయోగాలు, నోటి దురుసుతో అదే యుద్ధమనుకుంటోంది. తుర్కియే సాయమే గొప్పనుకుంటోంది. చైనా మద్దతిస్తుందని ఆశపడుతోంది. కానీ అదే సమయంలో రష్యా-భారత్‌కు మద్దతిచ్చింది. ఫ్రాన్స్‌ లాంటి అగ్రదేశాలు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే పాక్‌ బలూచిస్తాన్‌లో అంత్యరుద్ధం మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. నీళ్లుకూడా అందక రేపు తిండిగింజలకు కూడా అలమటించాల్సి వచ్చేలా ఉంది. అందుకే పిచ్చిపట్టినట్లు నియంత్రణరేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.

బయటకు వెళ్తే తలెత్తుకోలేక పోతున్నాం.. ఇది పాక్‌ జర్నలిస్టుల మాట. ఉగ్రవాదులను పెంచి పోషించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే కోపంతో ఉన్నారు పాక్‌ ప్రజలు కూడా. ప్రజల్లో ఎంత అసహనం ఉందో చెప్పేందుకే ఇస్లామాబాద్‌లోని లాల్‌ మసీదులో జరిగిన ఘటనే నిదర్శనం. భారత్‌తో యుద్ధం జరిగితే ఎవరు మా వెంట నిలుస్తారని మౌలానా అడిగితే.. ఒక్కటంటే ఒక్క చెయ్యీ పైకిలేవలేదు. పాక్‌లోని అంతర్గత రాజకీయాలు, ఆర్థికసంక్షోభంతో పాక్‌ ప్రజలు విసిగివేసారిపోయారు. పాలకులతో పాటు సైన్యంపైనా నమ్మకం కోల్పోతున్నారు. భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్‌కి ఇంతకంటే ఘోర అవమానం ఏముంటుంది? మరోవైపు ఆ దేశ నేతలు మాత్రం అణుబాంబులు ఉన్నాయి జాగ్రత్త అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇంకా చదవండి

మరింత భయంకరంగా ఆపరేషన్ సిందూర్ 2.0..! పాక్‌ వెన్నులో వణుకుపుట్టించేలా..

పశ్చిమ ఆర్మీ కమాండర్ లెఫ్ట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. పహల్గామ్ తరహా దాడులకు పాల్పడితే 'ఆపరేషన్ సిందూర్ 2.0' మరింత భయంకరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. "వెయ్యి కోతలతో భారత్‌ను రక్తసిక్తం చేయడం" అనే పాక్ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తిగా సన్నద్ధంగా ఉందని, గతంలో కంటే ప్రాణాంతకంగా ప్రతిస్పందిస్తుందని కటియార్ తెలిపారు.

  • SN Pasha
  • Updated on: Oct 15, 2025
  • 9:35 am

Operation Sindoor 2.0: ఈసారి ఆ మాటే ఉండదు.. భూమిపై ఉండాలో వద్దో పాకిస్తాన్‌ తేల్చుకోవాలి: ఆర్మీ చీఫ్ ద్వివేది

ఇండియన్ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పామంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఐకమత్యంగా ఈ యుద్దంలో పోరాడిందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను సైన్యం, ఎయిర్‌ఫోర్స్‌ ధ్వంసం చేశాయన్నారు.

Pakistan Cricket: పక్కకెళ్లి ఆడుకోండ్రా..! పాక్ క్రికెట్‌కు ఇక ఎండ్ కార్డేనా..?

చింత చచ్చినా పులుపు చావలేదనుకున్నాం.. కానీ, పాకిస్తాన్‌కి పులుసు కారడం కూడా ఇప్పుడిప్పుడే మొదలైనట్టుంది. దాయాది దేశపు క్రికెట్ పెద్దలకు ఎక్కిన కైపు కొద్దికొద్దిగా దిగొస్తున్నట్టే ఉంది. ఎందుకంటే.. న్యాయంగా మనకు దక్కాల్సిన కప్పును వెనక్కు తీసుకెళ్లి తొండాటకు దిగిన ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీకి ఇప్పుడిప్పుడే తత్వం బోధపడ్తున్నట్టుంది. పాకిస్తాన్ మంత్రి కూడా ఐన ఈ పెద్దమనిషి నిన్నటిదాకా మనమీద నోటికొచ్చినట్టు వెటకారమాడేశాడు.

India – Pakistan: డ్రామాలొద్దు.. ఉగ్రవాదంపై మీ బుద్ధి మారేవరకు నో వాటర్‌.. పాకిస్తాన్‌కు తేల్చి చెప్పేసిన భారత్

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం పాకిస్తాన్‌కు అలవాటే! మొన్న అణ్వస్త్రాల పేరుతో పులిలా గర్జించిన పాక్‌..ఇవాళ పిల్లిలా మారిపోయి మ్యావ్‌ మ్యావ్‌ అంటోంది. సింధు జలాల కోసం..నీళ్లివ్వండి మహా ప్రభో అంటూ భారత్‌ను అడుక్కుటోంది. కపట నాటకాలు చాలించు అంటూ పాక్‌కి మరోసారి ఇండియా వార్నింగ్‌ ఇచ్చింది.

ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యం నెరవేరింది.. అసలు నిజాలు బయటపెట్టిన ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన 5 ఫైటర్ జెట్‌లు ధ్వంసమయ్యాయని భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ అన్నారు. మురిద్కే , బహావల్‌పూర్‌ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. దీంతో పాటు, మరో పెద్ద విమానం కూడా ధ్వంసమైందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 కు క్రెడిట్ ఇచ్చారు.

చావు దెబ్బ నుంచి కోలుకోని పాక్.. ఇంకా తెరుచుకోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్!

పాకిస్తాన్ మరోసారి రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరానికి నోటామ్ జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ స్థావరాన్ని భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. అప్పటి నుండి పాకిస్తాన్ దానిని మరమ్మతు చేయడంలో బిజీగా ఉంది. మొదట్లో పాకిస్తాన్ ఈ స్థావరం గురించి మౌనంగా ఉంది, కానీ ప్రపంచవ్యాప్తంగా బేస్ విధ్వంసం చిత్రాలు, మ్యాప్‌లు బయటకు రావడంతో.. పాకిస్తాన్ దానిని మరమ్మతు చేసే పనిని ప్రారంభించింది.

Pahalgam Terrorist Attack: ఆపరేషన్‌ మహదేవ్‌.. పహల్గామ్‌‌లో టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులు హతం..

పహల్గామ్ లో అమాయక టూరిస్టులను  చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ , జమ్ముకశ్మీర్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు ఆసిఫ్‌ ఫౌజీ , సులేమాన్‌షా, అబూ తల్హా హతమయ్యారు.

వజీరిస్తాన్‌ ఆత్మాహుతి దాడిపై సంచలన ఆరోపణలు.. పాక్ తీరును తీవ్రంగా ఖండించిన భారత్..!

ఉత్తర వజీరిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. అయితే దీనిపై భారతదేశాన్ని నిందించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తీరుపై కేంద్రం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో 13మంది ప్రాణాలు కోల్పోగా, 24 మంది గాయపడ్డారు.

కశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ రెచ్చగొట్టే వాగుడు..! వారికి అన్ని విధాలా సపోర్ట్‌ చేస్తామంటూ..

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తన తాజా ప్రసంగాలలో కశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను అమరవీరులుగా అభివర్ణిస్తూ, కశ్మీర్‌లోని ఉగ్ర వాదాన్ని చట్టబద్ధమైన పోరాటంగా అభివర్ణించారు. భారతదేశంపై దాడికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారు.

  • SN Pasha
  • Updated on: Jun 29, 2025
  • 1:14 pm

పాక్ తోక వంకర.. మరోసారి ప్రధాని మోదీపై విషంకక్కిన ఆ దేశ రక్షణ మంత్రి..!

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి తప్పుగా మాట్లాడి, సొంత ప్రజల నుంచే ఛీత్కారాన్ని ఎదుర్కొంటున్నారు. బుద్ధి మార్చుకోవాలంటూ ఆయనకు సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకవైపు, పాకిస్తాన్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి, పాక్ ఆర్మీ చీఫ్ భారతదేశంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు.