AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యం నెరవేరింది.. అసలు నిజాలు బయటపెట్టిన ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన 5 ఫైటర్ జెట్‌లు ధ్వంసమయ్యాయని భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ అన్నారు. మురిద్కే , బహావల్‌పూర్‌ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. దీంతో పాటు, మరో పెద్ద విమానం కూడా ధ్వంసమైందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 కు క్రెడిట్ ఇచ్చారు.

ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యం నెరవేరింది.. అసలు నిజాలు బయటపెట్టిన ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌
Air Chief Marshal On Operation Sindoor
Balaraju Goud
|

Updated on: Aug 09, 2025 | 1:30 PM

Share

ఆపరేషన్‌ సింధూర్‌పై ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. S-400 డిఫెన్స్‌ సిస్టమ్‌ అద్భుతంగా పనిచేసిందని కితాబు ఇచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన ఐదు ఫైటర్‌ జెట్స్‌తో సహా ఆరు విమానాలను కూల్చేసినట్టు ప్రకటించారు. 9 ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. మురిద్కే , బహావల్‌పూర్‌ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. దీంతో పాటు, మరో పెద్ద విమానం కూడా ధ్వంసమైందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 కు క్రెడిట్ ఇచ్చారు.

కూలిపోయిన పెద్ద విమానాన్ని “బిగ్ బర్డ్” అంటే ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AWACS) అని వర్ణించారు. ఇది పాకిస్తాన్ నిఘా, కమాండ్ సామర్థ్యంలో ముఖ్యమైన భాగం. ఈ వైమానిక దాడుల క్రెడిట్‌ను రష్యన్ నిర్మిత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు ఇచ్చారు ఎయిర్ చీఫ్ మార్షల్. పాకిస్తాన్ విమానాలను లక్ష్యంగా చేసుకుని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేస్తామని పాక్‌ DGMOకు చెప్పి మరీ దాడులు చేసినట్టు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ తెలిపారు.

బెంగళూరులో జరిగిన ఎయిర్ మార్షల్ కాత్రే వార్షిక ఉపన్యాసంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ మాట్లాడుతూ, బహావల్పూర్‌లోని జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడికి ముందు.. తరువాత ఉపగ్రహ చిత్రాలు చుట్టుపక్కల భవనాలకు గణనీయమైన నష్టం జరగలేదని స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. స్థానిక మీడియా ద్వారా ఉగ్రవాద స్థావరాల లోపల నుండి ఉపగ్రహ చిత్రాలు మాత్రమే మనకు అందాయని ఆయన అన్నారు. భారత వాయుసేన 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందన్నారు ఎయిర్ మార్షల్. 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని తెలిపారు.

ఇదిలావుంటే, పహల్గామ్ దాడి తర్వాత మే 7న ” ఆపరేషన్ సిందూర్” అను భారత సైన్యం సమర్థవంతంగా నిర్వహించింది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ చర్యకు దిగింది భారత్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం