AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా సెలవులు.. గోవా వెళ్లిన హైదరాబాద్ జంటపై దాడి.. గర్భిణి అని కూడా చూడకుండా..

గోవాలో మరో దారుణం చోటుచేసుకుంది.. గోవా విహార యాత్రలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఓ జంటపై పనాజీ బస్‌స్టాండ్ వద్ద దాడి జరిగింది. బైక్ అద్దె విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారి తీసింది. వరుసగా సెలవులు రావడంతో.. హైదరాబాద్ కు చెందిన ఈ జంట గోవాలో గడిపేందుకు వెళ్లారు.

వరుసగా సెలవులు.. గోవా వెళ్లిన హైదరాబాద్ జంటపై దాడి.. గర్భిణి అని కూడా చూడకుండా..
Hyderabad Couple Faces Brutal Attack (representative image)
Ranjith Muppidi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 09, 2025 | 1:13 PM

Share

గోవాలో మరో దారుణం చోటుచేసుకుంది.. గోవా విహార యాత్రలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఓ జంటపై పనాజీ బస్‌స్టాండ్ వద్ద దాడి జరిగింది. బైక్ అద్దె విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారి తీసింది. వరుసగా సెలవులు రావడంతో.. హైదరాబాద్ కు చెందిన ఈ జంట గోవాలో గడిపేందుకు వెళ్లారు. అక్కడ ప్రయాణానికి బైక్ అద్దెకు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం.. బైక్‌ను సమయానికి తిరిగి అప్పగించినప్పటికీ.. బైక్ అద్దెకు ఇచ్చినవాళ్లు అదనంగా రూ.200 చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎందుకు చెల్లించాలంటూ వారు.. బైక్ అద్దెకు ఇచ్చిన వారిని ప్రశ్నించారు.

ఈ విషయంలో ఇరువురు మధ్య వాగ్వాదం తలెత్తింది.. ఈ క్రమంలో పనాజీ బస్‌స్టాండ్ సమీపంలో ఉన్న కొంతమంది బైక్ అద్దెకు ఇచ్చే వ్యక్తులు గుంపుగా వచ్చి జంటపై దాడికి పాల్పడ్డారు. దాడిలో హైదరాబాద్ వ్యక్తి తలకు గాయాలపాలయ్యారు. గర్భిణి అయిన మహిళకు ముఖం తీవ్రంగా ఉబ్బిపోయింది. గాయాలైన జంటను వెంటనే గోవా మెడికల్ కాలేజ్‌కి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇలాంటి ఘటనలు గోవాలో పర్యాటకుల భద్రతపై ప్రశ్నలు రేపుతున్నాయి. పోలీసులు పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా గోవాలో జరిగిన గొడవలో ఏపీకి చెందిన ఓ యువకుడు మరణించిన విషయం తెలిసిందే.. ఇలాంటి ఘటనల నేపథ్యంలో గోవాకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండటం మంచిదని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..